వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో మళ్లీ తిరగబెట్టిన కరోనా -ఐదు నెలల తర్వాత భారీగా కేసులు -లాక్‌డౌన్ -కుట్ర కోణం?

|
Google Oneindia TeluguNews

ప్రపంచంలో తొలి కరోనా తొలి మరణం నమోదయి నేటికి(జనవరి 11కు) సరిగ్గా ఏడాది పూర్తయింది. గడిచిన 14 నెలలుగా భూగోళాన్ని వణికిస్తోన్న మహమ్మారి.. సరికొత్త రూపాలతో మరింతగా విజృంభిస్తోంది. కరోనాకు చావు లేదని, కనీసం రెండు దశాబ్దాలపాటైనా దాని ప్రభావం ఉండొచ్చన్న సైంటిస్టుల అంచనాల నేపథ్యంలో వైరస్ పుట్టినిల్లు చైనాలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి..

వ్యాక్సిన్‌పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే -సీఎంలకు ప్రధాని భరోసా -నేతలు ఎగబడొద్దని వార్నింగ్వ్యాక్సిన్‌పై మోదీ సంచలనం -ఖర్చు కేంద్రానిదే -సీఎంలకు ప్రధాని భరోసా -నేతలు ఎగబడొద్దని వార్నింగ్

 5 నెలల తర్వాత మళ్లీ..

5 నెలల తర్వాత మళ్లీ..

చైనాలో కరోనా వైరస్ మళ్లీ తిరగబెట్టింది. దాదాపు ఐదు నెలల గ్యాప్ తర్వాత దేశంలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 103 కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. చైనాలో చివరిగా గతేడాది జులై 30న అత్యధికంగా 127 కేసులు నమోదు కాగా, మళ్లీ ఐదు నెలల తర్వాత వంద పైచిలుకు కొత్త కేసులు వచ్చాయి..

హెబీ ప్రావిన్స్ లో కలకలం

హెబీ ప్రావిన్స్ లో కలకలం

ప్రస్తుతం చైనాలోని పలు ప్రావిన్సుల్లో కొత్త కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుండటంతో జిన్ పింగ్ సర్కారు అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని వేగంగా కట్టడి చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నమోదవుతున్న మొత్తం కేసుల్లో అధిక శాతం హెబీ ప్రావిన్సులో ఉంటున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా బయటపడిన 103 కేసుల్లో హెబీ ప్రావిన్సులోనే 82 కేసులు వచ్చాయి. లియోనింగ్‌ ప్రావిన్సులో రెండు, బీజింగ్‌లో ఒకటి చొప్పున నమోదయ్యాయి. అంతేకాదు..

 చైనాలో మళ్లీ లాక్ డౌన్..

చైనాలో మళ్లీ లాక్ డౌన్..

ఇప్పటికే హీలోంగ్జియాంగ్‌ ప్రావిన్సులో కొత్తగా కరోనా వైరస్‌ కేసులు నమోదు కావడంతో సోమవారం నుంచి ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించినట్లు సమాచారం. హెబీ ప్రావిన్సు నుంచి దేశ రాజధాని బీజింగ్‌కు మధ్య రవాణా సౌకర్యాలను నిషేధించినట్లు అధికారులు తెలిపారు. చైనాలో ఇప్పటి వరకు 87,536 కరోనా కేసులు నమోదు కాగా...4,634 మంది వ్యాధి కారణంగా మరణించారు. మరోవైపు కరోనా పుట్టుక వెనుక కుట్ర కోణం ఉందా? అనే విషయాన్ని విచారణ జరిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణుల బృందం గడిచిన వారం రోజులుగా అక్కడ దర్యాప్తు చేస్తున్నది.

కరోనా కంటే 70%డేంజర్ బర్డ్ ఫ్లూ -మనుషులకు సోకితే చావు ఖాయం -అసలేంటీ H5N1 -చికెన్ తింటే అంతేనా?కరోనా కంటే 70%డేంజర్ బర్డ్ ఫ్లూ -మనుషులకు సోకితే చావు ఖాయం -అసలేంటీ H5N1 -చికెన్ తింటే అంతేనా?

English summary
Mainland China saw its biggest daily increase in COVID-19 cases in more than five months, the country’s national health authority said on Monday, as new infections in Hebei province surrounding Beijing continued to rise. A county in the northeastern Heilongjiang province on Monday moved into lockdown after reporting new novel coronavirus infections, state television also reported separately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X