India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ కు చైనా షాక్: అరుణాచల్ ప్రదేశ్ మాదే; భారత్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన చైనా

|
Google Oneindia TeluguNews

అరుణాచల్ ప్రదేశ్ లో పదిహేను ప్రాంతాలకు పేరుమార్చి కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోకుండా మరోమారు అరుణాచల్ ప్రదేశ్ తమదేనని తేల్చిచెప్పింది. అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా పేర్కొంటూ మ్యాప్ లో 15 ప్రాంతాలు పేర్లను మార్చిన చైనా 90 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ప్రాంతం తమదేనని మరోమారు పేర్కొంది.

అరుణాచల్ ప్రదేశ్ తమదేనని మరోమారు స్పష్టం చేసిన చైనా

అరుణాచల్ ప్రదేశ్ తమదేనని మరోమారు స్పష్టం చేసిన చైనా

భారతదేశం యొక్క ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని మరో 15 ప్రదేశాల పేరు మార్చడాన్ని చైనా శుక్రవారం సమర్థించింది. టిబెట్ యొక్క దక్షిణ భాగం "పురాతన కాలం నుండి చైనా భూభాగం" అని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని 15 ప్రదేశాల పేరు మార్చడాన్ని భారతదేశం గురువారం తీవ్రంగా వ్యతిరేకతను వ్యక్తం చేసింది. అభ్యంతరం తెలిపింది . చైనా పేరు మార్చిన ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో "ఎల్లప్పుడూ" అంతర్భాగంగా ఉంటుందని స్పష్టం చేసింది.

చైనా అరుణాచల్ ప్రదేశ్ లో 15 ప్రాంతాల పేర్లు మార్చటం ఖండించిన భారత్

చైనా అరుణాచల్ ప్రదేశ్ లో 15 ప్రాంతాల పేర్లు మార్చటం ఖండించిన భారత్

పేర్లను మార్చడం ఈ వాస్తవాన్ని మార్చదని నొక్కి చెప్పింది. బీజింగ్ దక్షిణ టిబెట్‌గా పేర్కొంటున్న అరుణాచల్ ప్రదేశ్‌లోని మరో 15 ప్రదేశాలకు చైనా పేర్లను చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించడంపై భారత్ ప్రతి స్పందనలో భాగంగా ఈ విషయాన్ని నొక్కి చెప్పింది.

తాము అలాంటివి చాలా చూశామని, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని స్థలాల పేరు మార్చడానికి చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. 2017 ఏప్రిల్‌లో చైనా కూడా అలాంటి పేర్లను కేటాయించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి న్యూఢిల్లీలో తెలిపారు.

భారత్ ప్రకటన తర్వాత మరోమారు అరుణాచల్ ప్రదేశ్ మాదే అన్న చైనా

భారత్ ప్రకటన తర్వాత మరోమారు అరుణాచల్ ప్రదేశ్ మాదే అన్న చైనా

భారతదేశం యొక్క ప్రకటనపై ప్రతిస్పందనగా చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, "జాంగ్నాన్ (చైనా యొక్క టిబెట్ యొక్క దక్షిణ భాగం) చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లో ఉందని పేర్కొన్నారు.

చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన నవీకరించబడిన డేటా పై వ్యాఖ్యలు చేసిన ఆయన "ఇది పురాతన కాలం నుండి చైనా భూభాగం," అని వెల్లడించారు. చైనా అరుణాచల్ ప్రదేశ్‌ని జాంగ్నాన్ అని పిలుస్తుంది. అంతకుముందు, "టిబెట్ యొక్క దక్షిణ భాగం చైనాలోని టిబెటన్ స్వయంప్రతిపత్తి ప్రాంతానికి చెందినదని, ఇది చైనా యొక్క స్వాభావిక భూ భాగమని జావో చెప్పారు.

అక్కడ నివసిస్తుంది చైనా జాతి మైనారిటీలు... దానిపై అధికారం చైనాదే

అక్కడ నివసిస్తుంది చైనా జాతి మైనారిటీలు... దానిపై అధికారం చైనాదే

మొయిన్బా మరియు టిబెటన్ జాతి సమూహాలు వంటి చైనా జాతి మైనారిటీలు చాలా కాలంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్థలాల పేర్లు ప్రకటించడం ద్వారా ప్రామాణిక పరిపాలనను బలోపేతం చేయడానికి జాంగ్నాన్‌లోని స్థలాల యొక్క ప్రామాణిక పేర్ల యొక్క రెండవ బ్యాచ్‌ను ప్రకటించామని, ఇది పూర్తిగా చైనా సార్వభౌమాధికారం పరిధిలోకి వస్తుంది అని జావో తన వ్యాఖ్యలలో పేర్కొన్నారు. చైనా విడుదల చేసిన అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థలాలకు సంబంధించిన ప్రామాణిక చైనీస్ పేర్లలో ఇది రెండవ బ్యాచ్. గతంలో ఆరు స్థలాల ప్రామాణిక పేర్ల మొదటి బ్యాచ్ 2017లో విడుదలైంది.

చైనా భారత్ మధ్య తెగని సరిహద్దు వివాదం .. రోజుకో రచ్చ

చైనా భారత్ మధ్య తెగని సరిహద్దు వివాదం .. రోజుకో రచ్చ

అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చైనా పేర్కొంటోంది. దీనిని విదేశాంగ మంత్రిత్వ శాఖ గట్టిగా తిరస్కరించింది, ఇది భారతదేశంలోని విడదీయరాని అంతర్భాగమని గట్టిగా సమాధానం చెబుతుంది. బీజింగ్ తన వాదనను పునరుద్ఘాటించడానికి అరుణాచల్ ప్రదేశ్‌లో భారతీయ అగ్రనేతలు మరియు అధికారుల పర్యటనలను నిరసిస్తూ వస్తుంది.

భారత్-చైనా సరిహద్దు వివాదం 3,488 కి.మీ పొడవైన వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి)వెంబడి కొనసాగుతుంది. గత ఏడాది మేలో ప్రారంభమైన తూర్పు లడఖ్ సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని స్థలాలకు చైనా పేరు మార్చడం జరిగింది. మరి ముందు ముందు ఈ వ్యవహారంలో చైనా ఏం చేయబోతోంది? భారత్ ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుంది అనేది? ఉత్కంఠగా మారింది.

English summary
China claiming that the renaming of 15 more places in India's Arunachal Pradesh part of china.Chinese Foreign Ministry spokesman Zhao Lijian says that the southern part of Tibet has always been its territory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X