వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్‌కు చైనా షాక్: సరిహద్దులో మిలటరీ డ్రిల్, ఉ.కొరియాకు దెబ్బేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్:ఉత్తరకొరియా నిర్వహిస్తున్న అణు పరీక్షలు, క్షిపణుల ప్రయోగాల నేపథ్యంలో ఛైనా అప్రమత్తమైంది. కొరియన్ పెనిన్సులాకు చేరువలో సముద్రంలో చైనా ఎయిర్‌ఫోర్స్ మిలటరీ డ్రిల్స్ నిర్వహించింది.

కిమ్ ఆస్తులపై అమెరికా కన్ను: ఉ.కొరియాపై ట్రంప్ మరిన్ని ఆంక్షలు కిమ్ ఆస్తులపై అమెరికా కన్ను: ఉ.కొరియాపై ట్రంప్ మరిన్ని ఆంక్షలు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని ప్రపంచదేశాలు భావిస్తున్నాయి. లేకపోతే ప్రపంచ దేశాల మనుగడకు కిమ్ ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉందని అగ్రదేశాలు భావిస్తున్నాయి.

ట్రంప్‌కు జింగ్‌పిన్ ఫోన్, ఉ.కొరియాపై అగ్రదేశాల వ్యూహమిదే!ట్రంప్‌కు జింగ్‌పిన్ ఫోన్, ఉ.కొరియాపై అగ్రదేశాల వ్యూహమిదే!

ఉత్తర కొరియా నిర్వహించిన తాజా అణు పరీక్షపై 'ప్రకంపనలు' కొనసాగుతున్నాయి. ఐక్యరాజ్య సమితితో పాటు పలు దేశాలు కిమ్‌ దుస్సాహసంపై మండిపడుతున్నాయి.

అమెరికా కట్టడికి కిమ్ ఇలా, ట్రంప్ సహనానికి కారణమిదే!అమెరికా కట్టడికి కిమ్ ఇలా, ట్రంప్ సహనానికి కారణమిదే!

కిమ్‌కు బుద్దిచెప్పేందుకు అగ్రదేశాలన్నీ కూడ సమాయాత్తమౌతున్నాయి.అయితే ఈ తరుణంలో చైనా కూడ ఉత్తరకొరియాకు ఝలక్ ఇచ్చింది. తాము చేతులు ముడుచుకొని కూర్చోలేదని కొరియాకు సంకేతాలు పంపింది.

కొరియా సరిహద్దులో మిలటరీ డ్రిల్ నిర్వహించిన చైనా

కొరియా సరిహద్దులో మిలటరీ డ్రిల్ నిర్వహించిన చైనా

ఉత్తర కొరియా ఆదివారం నాడు హైడ్రోజన్‌ బాంబు పరీక్షించిన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా అప్రమత్తమైంది. కొరియన్‌ పెనిన్సులాకు చేరువలో సముద్రంపై చైనా ఎయిర్‌ఫోర్స్‌ మిలిటరీ డ్రిల్స్‌ నిర్వహించింది. ఈ మిలటరీ డ్రిల్ ‌తో పాటు తమ ఆయుధాలు సిద్దంగా ఉన్నాయని చైనా రక్షణశాఖాధికారులు అభిప్రాయపడ్డారు. ఉత్తరకొరియా అనుసరిస్తున్న వైఖరితో తాము మరిన్ని మిలటరీ డ్రిల్స్ నిర్వహించనున్నట్టు చైనా అదికారులు అంటున్నారు.

ఉత్తరకొరియాకు సమాధానం చెప్పేందుకే

ఉత్తరకొరియాకు సమాధానం చెప్పేందుకే

ఉత్తరకొరియా ఆదివారం నాడు హైడ్రోజన్ బాంబును పరీక్షించిన నేపథ్యంలో.. దానికి సమాధానం చెప్పేందుకే ఆ దేశానికి సరిహద్దులోనే తాము మిలటరీ డ్రిల్ నిర్వహించినట్టు ఆ దేశ రక్షణ నిపుణుడు లీ ప్రకటించారు. తాము కూడ సర్వసన్నధ్దంగా ఉన్నట్టుగానే చైనా కొరియాకు సమాధానం చెప్పిందని లీ అభిప్రాయపడ్డారు.

చైనా స్థిరత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం

చైనా స్థిరత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోం

చైనా స్థిరత్వాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకొనే పరిస్థితి ఉండదని లీ అభిప్రాయపడ్డారు. ఆ శక్తులను తిప్పికొట్టే శక్తి తమకు ఉందని చైనా అధికారులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ మిలటరీ డ్రిల్ కొరియాకే కాదు అమెరికాకు కూడ హెచ్చరికేనని లీ అభిప్రాయపడ్డారు.

అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాలి

అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాలి

‘‘తన దేశ పౌరులతో పాటు లక్షలాది ప్రజలను ఉత్తర కొరియా ప్రమాదంలోకి నెట్టెస్తోంది. ఇప్పటికే ఆ దేశ ప్రజలు కరువుతో అలమటిస్తున్నార''ని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటానియో గుట్రెస్‌ అన్నారు. ఉత్తర కొరియా దుందుడుకు వైఖరిని హెచ్చరిస్తూ.. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి పెద్ద దేశాలు ఒకే ఎజెండాతో ముందుకు రావాలని సూచించారు. ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాలని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి బోరిస్‌ జాన్సన్‌ అంతర్జాతీయ సమాజానికి సూచించారు.

English summary
China shot down “incoming missiles” in the early hours of Tuesday morning during a military exercise held over the waters that separate it from the Korean peninsula.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X