వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పుల్వామా దాడిని ఖండించిన చైనా .. యూఎన్ఎస్సీ సభ్య దేశాల ఒత్తిడితో మారిన వైఖరి

|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్యసమితి: డ్రాగన్ చైనా వైఖరి ఎట్టకేలకు మారింది. పుల్వామా దాడికి తెగబడ్డ జైషే మహ్మద్ దుశ్చర్యను ఖండించింది. సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు చేసిన దుశ్చర్య పిరికిపంద చర్యగా అభివర్ణించింది.

స్వరం ఎందుకు మారిందంటే ..?
ఈ నెల 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ ను జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాది ఆదిల్ ఢీకొట్టడంతో 42 మంది జవాన్లు మ‌ృతిచెందారు. ఈ ఘటనను యావత్ ప్రపంచం ముక్తకంఠంతో ఖండించింది. అయితే డ్రాగన్ మాత్రం స్పందించలేదు. ఉగ్రదాడుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమతి భద్రత విభాగం (యూఎన్ఎస్సీ) గురువారం సమావేశమై చర్చించింది. ఈ భేటీలో ఫ్రాన్స్ పుల్వామా ఘటనను ప్రస్తావించింది. ఉగ్రదాడి జరిగిన భారత్ కు బాసటగా నిలువాల్సిన సమయం ఇది అని పేర్కొంది. అంతర్జాతీయ నియమాల ప్రకారం దాడులు హేయనీయమని, ఇలాంటి ఉల్లంఘనలను తీవ్రంగా ప్రతిఘటించాలని తెలిపింది. ఈ సందర్భంగా జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ తీర్మానం చేసింది. జైషే సంస్థను నిషేధిస్తున్నట్టు అందులో పేర్కొన్నది. దీనికి యూఎన్ఎస్సీ సభ్యుదేశాలన ఫ్రాన్స్ తోపాటు అమెరికా, ఇంగ్లాండ్, రష్యా ఆమోదం తెలిపింది. ఈ పరిస్థితుల్లో చైనా విధిగా మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది.

China signals shift: UNSC condemns Pulwama terror attack, names Jaish

కుటుంబాలకు సంతాపం
ఉగ్ర దాడిలో వీర మరణం పొందిన కుటుంబసభ్యులకు యూఎన్ఎస్సీ సంతాపం తెలియజేసింది. గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈ ఘటనతో భారత్ వెంట తాము ఉంటామని స్పష్టంచేసింది.

జైషే చీఫ్ అజహర్ ను కాపాడుతూ వస్తోన్న చైనా ..
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ కోరుతోంది. ముంబై దాడుల తర్వాత వివిధ దేశాలకు విన్నవించింది. అయితే ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యదేశాల్లో ఒక్కటైన చైనా .. మసూద్ అజహర్ ను గత 10 ఏళ్ల నుంచి కాపాడుతూ వస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రత విభాగం తీర్మానం 1267లో మసూద్ అంశం ప్రస్తావనకు వస్తోంది. అయితే శాంక్షన్ కమిటీలో ఈ అంశంపై చర్చకొచ్చిన ప్రతి సందర్భంలో మసూద్ ను వెనకొసుకొచ్చేది చైనా. గతంలో 2009, 2016, 2017లో జైషే సంస్థను నిషేధించాలని యూఎన్ఎస్సీలో చర్చకొచ్చిన అండగా నిలిచి తన కపటనీతిని బయటపెట్టింది చైనా. తాజాగా పుల్వామా ఉగ్రదాడి .. స్వయంగా జైషే మహ్మద్ సంస్థ దాడి చేసినట్టు పేర్కొనడంతో యూఎన్ఎస్సీ ఆ సంస్థను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా పేర్కొనక తప్పని పరిస్థితి నెలకొంది.

China signals shift: UNSC condemns Pulwama terror attack, names Jaish

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలిస్తాం ..
అంతేకాదు ఇటీవల జరుగుతున్న ఉగ్రదాడులను యూఎన్ఎస్సీ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాల్సిన సమయం ఆసన్నమైందని ఈ సందర్భంగా పేర్కొన్నది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే నిర్మూలించాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది. ఉగ్రవాదుల దుశ్చర్యలతో అంతర్జాతీయంగా భద్రతపై పెను సవాళ్లు ఎదురవుతున్నాయని .. అలాగే అశాంతి నెలకొనే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలను .. ఆ సంస్తలకు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తోన్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది.

English summary
Signalling a clear shift, China Thursday signed off on a United Nations Security Council (UNSC) statement that “condemned in the strongest terms” the Pulwama terror attack and named Pakistan-based Jaish-e-Mohammad for the “heinous and cowardly suicide bombing”. The statement is significant because China has singlehandedly blocked the listing of JeM chief Masood Azhar as a “global terrorist” at the UN Security Council Resolution 1267 sanctions committee for the last 10 years. At least three attempts in the last decade.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X