వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాల్వన్ ఘర్షణలో ఇండియా కంటే చైనాకే తక్కువ ప్రాణనష్టం .. చైనా బయటపడిందిలా !!

|
Google Oneindia TeluguNews

జూన్ లో భారత్, చైనా సైన్యం మధ్య గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో భారతదేశం కంటే చైనా చాలా తక్కువ ప్రాణనష్టానికి గురైందని చైనా ప్రభుత్వ అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ సంపాదకుడు పేర్కొన్నారు. ఆయన ఇండియా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలను ఖండించారు .

డ్రాగన్ కంట్రీకి జపాన్ బిగ్ షాక్ ... చైనా నుండి భారత్ కు కంపెనీలు తరలిస్తే భారీ రాయితీలుడ్రాగన్ కంట్రీకి జపాన్ బిగ్ షాక్ ... చైనా నుండి భారత్ కు కంపెనీలు తరలిస్తే భారీ రాయితీలు

గాల్వాన్ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారని చైనా అంగీకారం

గాల్వాన్ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారని చైనా అంగీకారం

తాజా వ్యాఖ్యలతో జూన్లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో తమ దళాల చేతిలో 20 మంది భారతీయ సైనికులు మరణించగా, ఇంకా చాలా మంది గాయపడ్డారని చైనా అంగీకారం తెలిపినట్లయింది . భారత్‌తో పోల్చితే చైనా వైపు భారీ నష్టాలు, ఎక్కువ ప్రాణనష్టాలు సంభవించాయని భారత్ రక్షణా శాఖామంత్రి రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ ఖండించారు .రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనపై భారత వార్తా నివేదికను ట్యాగ్ చేస్తూ గ్లోబల్ టైమ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ హు జిజిన్ ఒక ట్వీట్‌లో ఇలా అన్నారు.

భారత్ కంటే తక్కువగానే చైనా సైనికుల ప్రాణ నష్టం ట్వీట్ చేసిన గ్లోబల్ టైమ్స్ ఎడిటర్

భారత్ కంటే తక్కువగానే చైనా సైనికుల ప్రాణ నష్టం ట్వీట్ చేసిన గ్లోబల్ టైమ్స్ ఎడిటర్

నాకు తెలిసినంతవరకు, జూన్ 15 న గాల్వన్ వ్యాలీ ఘర్షణలో చైనా దళాల మరణాల సంఖ్య 20 కన్నా తక్కువ అని ఆయన పేర్కొన్నారు . భారత దళాలు , చైనా సైనికులను పట్టుకోలేదు, కాని పిఎల్‌ఎ ఆ రోజు చాలా మంది భారతీయ సైనికులను పట్టుకుంది అంటూ ఆయన పేర్కొన్నారు .కచ్చితమైన సంఖ్య ఎంతో ఆయన వెల్లడించలేదు . గ్లోబల్ టైమ్స్‌ ను చైనా పాలక కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక వార్తాపత్రిక పీపుల్స్ డైలీ ప్రచురించింది. ఈ ట్వీట్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురించి భారత మీడియా నివేదిక స్క్రీన్ షాట్ ను పోస్ట్ చేసి 'ఫేక్ న్యూస్' అంటూ ముద్ర వేశారు.

గాల్వాన్ ఘర్షణపై పార్లమెంట్ లో రాజ్ నాథ్ వ్యాఖ్యలు .. ఖండించిన చైనా మీడియా

గాల్వాన్ ఘర్షణపై పార్లమెంట్ లో రాజ్ నాథ్ వ్యాఖ్యలు .. ఖండించిన చైనా మీడియా

లడఖ్ ప్రాంతంలో జూన్ ఘర్షణ 40 సంవత్సరాలలో భారతదేశం మరియు చైనా మధ్య జరిగిన అతి దారుణమైన హింస. చైనా గాల్వాన్ ఘటనకు సంబంధించిన ప్రమాద గణాంకాలను విడుదల చేయలేదు. జూన్ 15 న గాల్వన్ వ్యాలీ ఘర్షణలను ప్రస్తావిస్తూ, రాజనాథ్ సింగ్ పార్లమెంటులో మాట్లాడుతూ, భారత సైనికులు చైనా వైపు కూడా భారీ ప్రాణనష్టంతో చైనాకు మూల్యం చెల్లించారని పేర్కొన్నారు . సాయుధ దళాలు ఎప్పుడూ సవాలుకు సిద్ధంగా ఉన్నారని , దేశాన్ని గర్వించేలా చేస్తారని దేశానికి పూర్తి విశ్వాసం ఉందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

చైనా , భారత్ సరిహద్దుల మధ్య నేటికీ కొనసాగుతున్న వివాదం

చైనా , భారత్ సరిహద్దుల మధ్య నేటికీ కొనసాగుతున్న వివాదం

ఏప్రిల్-మే నుండి లడఖ్‌లో భారతదేశం మరియు చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి, అయితే జూన్ 15 న గాల్వన్ వ్యాలీ ఘర్షణల తరువాత ఇవి 20 రెట్లు పెరిగాయి, ఇందులో 20 మంది భారత ఆర్మీ సైనికులు మరణించారు. చైనా వైపు కూడా ప్రాణనష్టం జరిగింది. ఆగస్టు 29 మరియు 30 అర్ధ రాత్రి పాంగాంగ్ సరస్సు యొక్క దక్షిణ ఒడ్డున భారత భూభాగాన్ని ఆక్రమించటానికి చైనా విఫలమైన తరువాత పరిస్థితి మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది . అనేక మార్లు దౌత్య మరియు సైనిక స్థాయి చర్చలు వివాదానికి పరిష్కారం తీసుకురావడంలో విఫలమయ్యాయి. ఇప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి ఉంది .

English summary
China has suffered “far fewer” casualties than the Indian side in the June Galwan clash, said editor of Chinese government mouthpiece, Global Times, while rejecting the remarks of Defence Minister Rajnath Singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X