వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దులో చైనా విన్యాసాలు: 'భారత్‌ను బెదరగొట్టేందుకే'

డోక్లామ్ సెక్టార్‌లో భారత్, చైనాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, వెస్ట్రన్ థియేటర్ ఆర్మీ లైవ్ డ్రిల్ ఎక్సర్ సైజులను చేపట్టింది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: డోక్లామ్ సెక్టార్‌లో భారత్, చైనాల మధ్య సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, వెస్ట్రన్ థియేటర్ ఆర్మీ లైవ్ డ్రిల్ ఎక్సర్ సైజులను చేపట్టింది.

పాకిస్తాన్‌కు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్, భారత్‌పై ఇలాపాకిస్తాన్‌కు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ వార్నింగ్, భారత్‌పై ఇలా

చైనా విన్యాసాలు

చైనా విన్యాసాలు

చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్, ప్రభుత్వ రంగ చైనా సెంట్రల్ టెలివిజన్‌లు ప్రచురించిన వార్తలు, చూపిన విజువల్స్ ప్రకారం, 10 పీఎల్ఏ యూనిట్‌లు ఈ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. యుద్ధ విమానాలు, సాయుధులైన జవాన్లు ఈ డ్రిల్స్ చేస్తున్నాయి.

డొక్లాంకు ఎంత దూరమో చెప్పలేదు

డొక్లాంకు ఎంత దూరమో చెప్పలేదు

అయితే, ఈ విన్యాసాలు డోక్లామ్‌కు ఎంత దూరంలో నిర్వహిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. ఐదు నిమిషాల నిడివివున్న వీడియోలో భూమిపై ఉన్న టార్గెట్లను ఫైటర్ చాపర్లు పేల్చి వేస్తున్న దృశ్యాలున్నాయి.

భారత్‌ను బెదరగొట్టేందుకే

డొక్లాం ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్‌ను బెదరగొట్టేందుకే చైనా ఈ సైనిక విన్యాసాలు నిర్వహించినట్లు రక్షణ రంగం నిపుణిడిని ఉటంకిస్తూ ఆ పత్రిక చెప్పుకొచ్చింది.

డొక్లాం ఉద్రిక్తత

డొక్లాం ఉద్రిక్తత

కాగా, డోక్లామ్ తమదేనని, ఇక్కడ భారత దళాలు తిష్ట వేసుకుని కూర్చున్నాయని చైనా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. గడచిన జూలైలోనూ పీఎల్ఏ సైన్యం ఇదే తరహా లైవ్ ఎక్సర్ సైజులను టిబెట్ సరిహద్దుల్లో చేపట్టింది.

English summary
China's PLA conducts military drills to strike awe in India as Doklam standoff continues, Chinese media claims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X