వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ వత్తిళ్లకు దిగొచ్చిన డ్రాగన్ !? మసూద్ అజార్‌పై ఐరాస ఆంక్షలకు సై..?

|
Google Oneindia TeluguNews

పుల్వామా దాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ఆంక్షలు విధించాలని పలు దేశాలు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిపై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యం అమెరికా, ఫ్రాన్స్ , యూకే లాంటి దేశాలు మసూద్ అజార్‌పై ఆంక్షలు విధించాలన్న డిమాండ్‌కు పొరుగుదేశం చైనా అడ్డుపడుతూ వచ్చింది. సాంకేతిక కారణాలు చూపుతూ ఈ గ్లోబల్ టెరరిస్టును వెనకేసుకొచ్చింది. అయితే తాజాగా చైనా మరో ప్రకటన చేసింది. ఇంతకీ ఆ ప్రకటన ఏంటి... దీంతో పరిణామాలు ఎలా మారుతాయి..?

మసూద్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన చైనా

మసూద్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన చైనా

పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైషేమహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన డ్రాగన్ కంట్రీ చైనా.... ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం. మసూద్ అజార్‌పై ఆంక్షలు విధించేందుకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మే 1వ తేదీన ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ సమావేశంలో చైనా తన నిర్ణయాన్ని వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. నిజంగా చైనా అడ్డుకోకపోతే ఇక మసూద్ అజార్ పై ఆయన నిర్వహిస్తున్న ఉగ్రసంస్థపై ఆంక్షలు తప్పవు.

ఆంక్షలు నిజమైతే మోడీ సర్కార్‌కు ఘనవిజయమే

ఆంక్షలు నిజమైతే మోడీ సర్కార్‌కు ఘనవిజయమే

జైషేమహ్మద్ చీఫ్ మసూద్ అజార్ పై ఆంక్షలు విధిస్తే మోడీ సర్కార్‌కు ఒకరకంగా ఇది ఘనవిజయమే అవుతుంది. ఫిబ్రవరి 14న పుల్వామా దాడులు జరిగిన సమయం నుంచే మసూద్‌పై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసి ఆంక్షలు విధించాలని ఒత్తిడి తీసుకొస్తూ వస్తోంది. "కార్మికుల దినోత్సవం రోజున మసూద్ అజార్‌పై ఐక్యరాజ్య సమితి ఇస్లామిక్ స్టేట్ మరియు ఆల్‌ఖైదా ఆంక్షల కమిటీ చర్యలు తీసుకోనుంది. ఇందుకు చైనా సహకరించడం శుభపరిణామం" అని ఐక్యరాజ్యసమితికి చెందిన ఒక ఉన్నతాధికారి తెలిపారు.

 నాలుగు సార్లు మసూద్‌ను వెనకేసుకొచ్చిన చైనా

నాలుగు సార్లు మసూద్‌ను వెనకేసుకొచ్చిన చైనా

మార్చి 13న సాంకేతిక కారణాలు చూపుతూ మసూద్ అజార్‌ను వెనకేసుకొచ్చింది చైనా. ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యదేశాలన్నీ మసూద్‌పై ఆంక్షలు విధించాలని కోరగా చైనా మాత్రం మోకాళ్లు అడ్డేసింది. ఇదిలా ఉంటే మే 15న డ్రాగన్ కంట్రీ మసూద్ అజార్‌ను బుక్ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.మొత్తంగా నాలుగు సార్లు మసూద్ అజార్‌పై ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్యసమితి రంగం సిద్ధం చేసుకోగా అన్ని సార్లు మసూద్ అజార్‌పై ప్రేమ ఒలకబోసి ఆంక్షలు విధించకుండా అడ్డుపడింది డ్రాగన్ కంట్రీ. అయితే ఈసారి జరిగే ప్రయత్నంలోనైనా చైనా అన్ని సజావుగా జరిగేలా చూస్తుందోలేదో వేచిచూడాలి.

English summary
China is expected to lift its hold on blacklisting Pakistan-based Jaish-e-Mohammed (JeM) chief Masood Azhar at a UN sanctions committee on May 1, paving the way for further global financial sanctions against the banned group, people familiar with the development said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X