వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ చైనా కవ్వింపు చర్యలు: బార్డర్లో మిలిటరీ బేస్, బాంబ్ ప్రూఫ్ షెల్టర్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మన దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి కేవలం 1350 కిలో మీటర్ల దూరంలో, భారత దేశపు సరిహద్దు సమీపంలో టిబెట్ ఎయిర్ పోర్ట్‌ను చైనా మిలిటరీ బేస్‌గా మార్చుతోంది. ఇది భారత్‌కు ఆందోళన కలిగించే అంశం. అండర్ గ్రౌండ్ బాంబ్ ప్రూఫ్ షెల్టర్లు కూడా నిర్మిస్తోంది. చైనా పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

బీజేపీ షాకింగ్: మధ్యప్రదేశ్‌లో మంత్రులు సహా 70 మందికి టిక్కెట్ నిరాకరణ!బీజేపీ షాకింగ్: మధ్యప్రదేశ్‌లో మంత్రులు సహా 70 మందికి టిక్కెట్ నిరాకరణ!

 భూగర్భంలో బంకర్లు, బాంబు ప్రూఫ్ షెల్టర్లు

భూగర్భంలో బంకర్లు, బాంబు ప్రూఫ్ షెల్టర్లు

గతంలో డొక్లాంలో కవ్వింపు చర్యలకు దిగింది. ఇప్పుడు టిబెట్‌లోని లహసా గోంగ్గర్ విమానాశ్రయాన్ని చైన తన సైనిక స్థావరంగా మార్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీని ప్రాంగణ భూగర్భంలో బంకర్లు, బాంబు దాడులనుతట్టుకునే విధంగా స్థావరాలను నిర్మిస్తోందని తెలుస్తోంది.

నాడు విమానాశ్రయం పేరుతో, నేడు సైనిక స్థావంరం

నాడు విమానాశ్రయం పేరుతో, నేడు సైనిక స్థావంరం

మారుమూల ప్రాంతాలకూ అనుసంధానం పెంచాలనే ఉద్దేశ్యంతో విమానాశ్రయం నిర్మించినట్లుగా గతంలో చైనా చెప్పింది. ఇప్పుడు సైనిక స్థావరంగా మార్చడం భారత్‌కు తీవ్ర ఆందోళన కలిగించే విషయం.

 చైనా దౌత్య కార్యాలయం నుంచి లేని స్పందన

చైనా దౌత్య కార్యాలయం నుంచి లేని స్పందన

చైనా తీరుపై భారత భద్రతా అధికారులకు ఇప్పటికే సమాచారం అందించారని తెలుస్తోంది. చైనా రక్షణ మౌలిక సదుపాయాలను పెంచుకుంటోంది. భారత్ కూడా ధీటుగా బదులిచ్చేలా సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని భావిస్తోంది. ఈ బంకర్లపై చైనా దౌత్య కార్యాలయాన్ని ప్రశ్నిస్తే స్పందం లేదని తెలుస్తోంది.

డొక్లాం తర్వాత

డొక్లాం తర్వాత

డొక్లాం విషయంలో గత ఏడాది భారత్ - చైనా దేశాలు ఒప్పందానికి వచ్చాయి. దీంతో అప్పుడు వివాదం ముగిసింది. ఇప్పుడు భారత్‌కు సమీపంలో ఉన్న విమానాశ్రయాన్ని సైనిక స్థావరంగా ఉపయోగించుకునేలా చేస్తూ కవ్వింపుకు దిగుతోంది. యుద్ధం తరహా పరిస్థితులు ఉన్నప్పుడే ఈ స్థావరాల్లో సైనికులను సురక్షితంగా ఉంచి దాడులు చేపడుతున్నారు. చైనా వైమానిక దళానికి రష్యాతో సరిహద్దులో ఇలాంటి స్థావరాలు ఉన్నాయి. ఇప్పుడు టిబెట్ అటానమస్ రీజియన్లో భారత్‌కు సమీపంలో ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం గమనార్హం.

English summary
The People’s Liberation Army has such facilities along its border with Russia, and the underground bomb-proof facilities along the India-China border in the Tibet region is a “new development,” an official said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X