వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తర కొరియా ఎపెక్ట్: చైనా సైంటిస్ట్‌ల పరిశోధనలో షాకింగ్, కిమ్‌కు చెక్

ఉత్త‌ర కొరియా చేప‌డుతున్న అణుప‌రీక్ష‌ల కార‌ణంగా చైనా-ఉత్త‌ర కొరియా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో రేడియేష‌న్ స్థాయుల్లో మార్పులు క‌నిపిస్తున్నాయ‌ని చైనా శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఉత్త‌ర కొరియా చేప‌డుతున్న అణుప‌రీక్ష‌ల కార‌ణంగా చైనా-ఉత్త‌ర కొరియా స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో రేడియేష‌న్ స్థాయుల్లో మార్పులు క‌నిపిస్తున్నాయ‌ని చైనా శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు.

చదవండి: ఉ.కొరియా మాకంటే బెస్ట్, మేం పరిజ్ఞానం ఇవ్వలేదు: పాక్ శాస్త్రవేత్త

రేడియేషన్ పెరుగుతోందని ఆందోళన

రేడియేషన్ పెరుగుతోందని ఆందోళన

ఇక్క‌డి ప్రాంతాల్లో రేడియేష‌న్ నెమ్మ‌దిగా పెరుగుతోంద‌ని శాస్త్రవేత్తలు వెల్ల‌డించారు. అయితే ఉత్త‌ర కొరియా అణు ప‌రీక్ష‌ల ద్వారా ప‌ర్యావ‌ర‌ణంలో ఎలాంటి మార్పు క‌నిపించ‌లేద‌ని చైనా ప్ర‌భుత్వం అధికారికంగా చేసిన ప్ర‌క‌ట‌న‌కు విరుద్ధంగా శాస్త్ర‌వేత్త‌ల నివేదిక ఉంది.

పెరిగిన రేడియేషన్

పెరిగిన రేడియేషన్

ఇరు దేశాల స‌రిహ‌ద్దుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న చాంగ్‌బాయ్ ప్రాంతంలో స‌రాస‌రిగా గంట‌కు 104.9 నానోగ్రేలు ఉండాల్సిన రేడియేష‌న్ స్థాయి ఆదివారం అణుప‌రీక్ష జ‌రిగిన వెంట‌నే 108.5 నానోగ్రేల‌కు పెరిగింద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

నెమ్మదిగా పెరుగుతోన్న రేడియేషన్

నెమ్మదిగా పెరుగుతోన్న రేడియేషన్

కానీ గురువారం నాటికి అక్క‌డి రేడియేష‌న్ స్థాయి 110.7 - 112.5 నానోగ్రేలకు చేరుకుంద‌ని శాస్త్రవేత్తలు చెప్పారు. దీనిని బ‌ట్టి రేడియేష‌న్ స్థాయి నెమ్మ‌దిగా పెరుగుతున్న‌ట్లు అర్థం చేసుకోవాల‌ని, ఒక‌వేళ ఈ స్థాయి మ‌రింత పెరిగితే తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి ప్ర‌భుత్వం ఆలోచించాల‌ని ఓ ప‌త్రిక ప్ర‌చురించింది.

ప్రమాదం లేదు కానీ

ప్రమాదం లేదు కానీ

స‌రిహ‌ద్దు వ‌ద్ద గ‌ల ఆంటూ, యాన్‌బియాన్ ప్రాంతాల్లోనూ రేడియేష‌న్ పెరిగిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. అయితే ప్ర‌స్తుతం ఉన్న‌ రేడియేష‌న్ స్థాయి వ‌ల్ల మాన‌వుల‌కు ఎలాంటి ప్ర‌మాదం ఉండ‌ద‌ని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

జిన్‌పింగ్‌తో ట్రంప్‌ సంభాషణ

జిన్‌పింగ్‌తో ట్రంప్‌ సంభాషణ

ఉత్తర కొరియాపై సైనిక చర్య తీసుకోవడం తమ తొలి ప్రాధాన్యత కాదని, అలాగని దాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. క్షిపణుల ప్రయోగాలు చేస్తున్న ఉత్తర కొరియా సమస్యపై బుధవారం ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఫోనులో మాట్లాడారు.

నిర్మోహమాటంగా చెప్పానని

నిర్మోహమాటంగా చెప్పానని

సంభాషణల్లో భాగంగా ఆయన పై వ్యాఖ్య చేశారు. జిన్‌పింగ్‌తో నిర్మొహమాటంగా మాట్లాడానని చెప్పారు. మరోవైపు, ఉత్తర కొరియా తీరుపై ఐక్యరాజ్య సమితి ఆగ్రహం నేపథ్యంలో చైనా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉత్తర కొరియాను శిక్షించాలని అభిప్రాయపడుతోంది.

English summary
The nation revealed it would support United Nations sanctions against its erratic neighbour just days after it shot down missiles near the North Korean border in a provocative display of force against the regime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X