వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రాగన్ జోన్ : జమ్మూకశ్మీర్‌ను యూటీగా చేయడంపై విషం చిమ్మిన చైనా

|
Google Oneindia TeluguNews

బీజింగ్ : గురువారం నుంచి జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా ఆవిర్భవించింది. అయితే దీనిపై ముందునుంచి విషం కక్కుతున్న పాకిస్తాన్‌కు అండగా నిలిచింది డ్రాగన్ కంట్రీ చైనా. జమ్మూకశ్మీర్‌ను విభజించడం అన్యాయమైన చర్య అని చైనా విషం చిమ్మింది. అంతేకాదు చైనా సరిహద్దును కూడా భారత్ దృష్టిలో ఉంచుకుని గౌరవించాలని సూచించింది.

జమ్మూ కాశ్మీర్ లో జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం: స్థలాన్ని కొనబోతున్న ప్రభుత్వంజమ్మూ కాశ్మీర్ లో జోరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం: స్థలాన్ని కొనబోతున్న ప్రభుత్వం

జమ్మూకశ్మీర్‌ను విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు చైనా విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి గెంగ్ షాంగ్. జమ్మూకశ్మీర్‌ను విభజించి లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా భారత్ చేసిందన్న చైనా... లడఖ్‌తో కొంత చైనా భూభాగం ఉందని చెబుతూ దాన్ని కూడా భారత పాలనావిభాగం కిందకు తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించింది చైనా.

China unhappy over Jammu Kashmir move, terms its unlawful and void

చైనా సార్వభౌమత్వాన్ని పట్టించుకోకుండా భారత్ ఎప్పటికప్పుడు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదని సూచించింది. అంతేకాదు లడఖ్‌లో చాలా భూభాగం లైన్‌ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్‌ పరిధిలో ఉంటుందన్న విషయం భారత్ గుర్తుంచుకోవాలని చైనా హెచ్చరించింది.

ఇక కశ్మీర్ అంశంపై మాట్లాడిన చైనా ప్రతినిధి అది చరిత్ర మిగిల్చిన వివాదం అని చాలా సామరస్యంగా ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు అనుగుణంగా పరిష్కరించుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ద్వైపాక్షిక చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాలు ఇతరత్ర ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకుని సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించింది డ్రాగన్ కంట్రీ. ఇక జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా చేస్తున్నట్లు మూడునెలల క్రితం కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. దీంతో దేశంలో 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చాయి.

English summary
With the official bifurcation of the Jammu and Kashmir in two new Union territories coming into effect on Thursday, China had voiced its strong dissatisfaction and firm opposition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X