వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక, కిమ్ జాంగ్ ఉన్‌కు చైనా సూచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అణ్వాయుధాలను వదిలేయాలని అగ్రరాజ్యం అమెరికా బలవంతం చేస్తే డోనాల్డ్ ట్రంప్‌తో కిమ్ జోంగ్‌ ఉన్‌ భేటీని పునఃపరిశీలించాల్సి ఉంటుందని ఉత్తర కొరియా పేర్కొంది.

అణుపరీక్షల కేంద్రం ధ్వంసం చేస్తా: మరో షాకిచ్చిన కిమ్ జాంగ్, తెలివైన నిర్ణయమని ట్రంప్అణుపరీక్షల కేంద్రం ధ్వంసం చేస్తా: మరో షాకిచ్చిన కిమ్ జాంగ్, తెలివైన నిర్ణయమని ట్రంప్

అణ్వాయుధాలను వదిలిపెట్టాలనే ఏకపక్ష డిమాండుతో తమను ఇరుకున పెట్టాలని అమెరికా చూస్తే చర్చల ప్రసక్తే ఉండదని తెలిపింది. జూన్‌ 12న సింగపూర్‌లో అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షులు కిమ్‌ జాంగ్ ఉన్ భేటీ కానున్నారు.

China urges North Korea to proceed Trump summit amid threats

అమెరికా వైఖరి మారకపోతే ఇరుదేశాధినేతల మధ్య సమావేశం జరగబోదని ఉత్తర కొరియా తెలిపింది. మరోవైపు ట్రంప్‌, కిమ్‌ భేటీకి సన్నాహాలు చేస్తున్నామని, ఉత్తర కొరియా ప్రకటనలపై తమకు సమాచారం లేదని అమెరికా పేర్కొంది. బుధవారం దక్షిణకొరియాతో జరగాల్సిన ఉన్నతస్థాయి చర్చలను కూడా ఉత్తరకొరియా రద్దు చేసుకుంది.

అమెరికా - దక్షిణ కొరియాలు కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాలు చేయడంపై ఉత్తర కొరియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ సైనిక విన్యాసాలు తమను రెచ్చగొట్టేలా ఉన్నాయని, తమపై దాడి చేసే ముందస్తు సైనిక విన్యాసాలుగా వాటిని భావిస్తున్నట్లు ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. కాగా, ట్రంప్‌తో సమ్మిట్ రద్దు చేసుకోవద్దని చైనా.. ఉత్తర కొరియాకు సూచించింది.

English summary
China on Wednesday urged ally North Korea to proceed with a historic summit between its leader, Kim Jong Un, and U.S. President Donald Trump, amid the North's threats to scrap the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X