వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎల్బీతో పెట్టుకోవద్దు, మీ వల్ల కాదు: భారత్‌కు తాజా చైనా హెచ్చరిక

చైనా తన రెచ్చగొట్టే దోరణి మానుకోవడం లేదు.డోక్లామ్‌ వివాదం నేపథ్యంలో భారత్‌పై వరుస బెదిరింపులకు పాల్పడుతున్న చైనా మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్‌: చైనా తన రెచ్చగొట్టే దోరణి మానుకోవడం లేదు. సిక్కిం సరిహద్దు డోక్లామ్‌ వివాదం నేపథ్యంలో భారత్‌పై వరుస బెదిరింపులకు పాల్పడుతున్న చైనా మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. 'చైనా మిలటరీ సామర్థ్యాలను తక్కువగా అంచనా వేస్తూ.. కలలు కనకండి' అంటూ ఆ దేశ రక్షణశాఖ భారత్‌పై కయ్యానికి కాలు దువ్వింది.

అది కొండ కాదు.. పీఎల్బీ...

‘పర్వతాన్ని కదిలించడం కూడా సులువే.. కానీ పీపుల్స్‌ లిబరేషన్‌(చైనా) ఆర్మీని కదిలించడం మాత్రం చాలా కష్టం' అని చైనా రక్షణశాఖ ప్రతినిధి వు ఖియాన్‌ వ్యాఖ్యానించారు. భారత్‌ తన తప్పును సరిదిద్దుకోవాలంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

వరుస బెదిరింపులు..

వరుస బెదిరింపులు..

సిక్కిం సరిహద్దు డోక్లాం వివాదం నేపథ్యంలో భారత్‌, చైనా మధ్య గత కొన్నివారాలుగా ప్రతిష్ఠంభన నెలకొన్న విషయం తెలిసిందే. భారత బలగాలు సరిహద్దును దాటి తమ కార్యకలాపాలను అడ్డుకుంటున్నాయని చైనా ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి భారత్‌పై వరుస బెదిరింపులకు పాల్పడుతోంది.

యుద్ధానికి సిద్ధమవుతోంది!: చైనా బలగాల మోహరింపు, రిహార్సల్స్(వీడియో) యుద్ధానికి సిద్ధమవుతోంది!: చైనా బలగాల మోహరింపు, రిహార్సల్స్(వీడియో)

యుద్ధమేనంటూ...

యుద్ధమేనంటూ...

వెంటనే వెనక్కి పోవాలని లేదంటే పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయని హెచ్చరిస్తోంది. అయితే ఇది దేశభద్రతకు సంబంధించిన విషయం అని.. దీన్ని దౌత్యపరమైన చర్చలతో పరిష్కరించాలని భారత్‌ చెబుతోంది. చైనా దళాలు వెనక్కి వెళితే.. తమ దళాలు కూడా వెనక్కి వెళతాయని స్పష్టం చేసింది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా ఇరు పక్షాల సైనికులు వెనక్కి వెళ్లి చర్చలు జరపాలని ఇటీవల పార్లమెంట్‌లో చెప్పారు. దీనిపై చైనా రక్షణశాఖ స్పందించింది.

ఊహాగానాలొద్దు..

ఊహాగానాలొద్దు..

చైనా మిలిటరీని కదపడం అంత కష్టం కాదని వు ఖియాన్‌ అన్నారు. ‘పరిస్థితులను భారత్‌ అదృష్టానికి వదిలేయొద్దు. చైనా మిలిటరీపై ఎలాంటి అవాస్తమైన ఊహాగానాలు పెట్టుకోకపోవడమే మంచిది' అని హితవు పలికారు. 1962 నాటి తప్పును పునరావృతం కానివ్వొద్దని హెచ్చరించడం గమనార్హం. తాజా చైనా హెచ్చరికకు భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

English summary
China's defence ministry on Monday warned India not to harbour any illusions about the Chinese military's ability to defend its territory, amid a festering border dispute."Shaking a mountain is easy but shaking the People's Liberation Army is hard," ministry spokesman Wu Qian told a briefing, adding that its ability to defend China's territory and sovereignty had "constantly strengthened".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X