వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా హెచ్చరిక... క్లారిటీ ఇచ్చిన డబ్య్లూహెచ్‌వో

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇక భారత దేశంలో కూడా కరోనా ప్రతాపాన్ని చూపిస్తుంది. ఇక ఇండియాలో ఇప్పటికే కరోనా కేసులు 78,056 నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. ఇక ప్రపంచ దేశాలకు అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను నియంత్రించటానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాయి కరోనా ప్రభావిత దేశాలు . ఇక ఈ వైరస్ ను అడ్డుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్‌వో) పలు కీలక సూచనలు చేస్తూనే ఉంది . అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా కరోనా వైరస్ నేపధ్యంలో పలు విమర్శలకు గురవుతుంది.

కరోనాతో ముంచుకొస్తున్న ఉపద్రవం ... ప్రపంచానికి తీవ్ర ఆహార సంక్షోభం !!కరోనాతో ముంచుకొస్తున్న ఉపద్రవం ... ప్రపంచానికి తీవ్ర ఆహార సంక్షోభం !!

ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా బెదిరింపులకు గురైందని వెలుగులోకి వార్త

ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా బెదిరింపులకు గురైందని వెలుగులోకి వార్త

ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనాలో కరోనా పరిస్థితి ముందే తెలిసినా ప్రపంచ దేశాలను అలెర్ట్ చెయ్యలేదని ఇప్పటికే పలు దేశాలు ప్రపంచ ఆరోగ్య సంస్థను విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థకు తమ సహాయం అందించమని తెగేసి చెప్పి మరీ విమర్శలు గుప్పిస్తుంది. ఇక అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏ మాత్రం అవకాశం దొరికినా చైనానే ఈ ఉత్పాతానికి కారణం అని చెప్తున్నారు . ఇక ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా బెదిరింపులకు గురైందని తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది .

బయటపెట్టిన అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ

బయటపెట్టిన అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ

చైనాలోని వూహాన్ లో కరోనా మొదలైంది . అయితే అక్కడ కరోనా విజృంభిస్తున్న సంగతి , కరోనా తీవ్రత బయటికి రాకుండా డబ్ల్యూహెచ్ఓ ను చైనా హెచ్చరించిన విషయం తాజాగా బయటకు వచ్చింది. ఇక ఈ విషయాన్ని అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బయటపెట్టింది. చైనాలో కరోనా విజృంభిస్తున్నప్పుడు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డబ్ల్యూహెచ్ఓ భావించినప్పటికీ చైనా అడ్డుపడింది . అయితే ఆ విషయాన్నీ బయటపెడితే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తమ సహకారాన్ని ఆపేస్తామని డబ్ల్యూహెచ్ఓను చైనా బెదిరించినట్టు సీఐఏ వెల్లడించింది .

తాము స్వతంత్రంగానే వ్యవహరించామంటున్న డబ్ల్యూహెచ్ఓ వర్గాలు

తాము స్వతంత్రంగానే వ్యవహరించామంటున్న డబ్ల్యూహెచ్ఓ వర్గాలు

ఇక ఈ తాజా నివేదికను ఉటంకిస్తూ ‘న్యూస్‌వీక్' అనే పత్రిక తన కథనంలో ఈ విషయాన్ని చైనా బెదిరింపులను ఉద్దేశించి పేర్కొంది . ఇక కరోనా విషయంలో ట్రంప్ చైనాపై మండిపడుతున్నారు. ప్రతిసారి చైనా ను విమర్శిస్తున్న ట్రంప్ వ్యాఖ్యలకు ఈ కథనం తో మరింత బలం చేకూరుతోంది. అయితే చైనా బెదిరింపు వార్తలను ఖండిస్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ . కరోనా విషయంలో తాము స్వతంత్రంగానే వ్యవహరించామని డబ్ల్యూహెచ్ఓ వర్గాలు వెల్లడించాయని 'న్యూస్ వీక్' పత్రిక పేర్కొంది. అంతే కాకుండా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధ్‌నామ్ మధ్య ఫోన్ జనవరిలో ఫోన్ సంభాషణ జరిగినట్టు వస్తున్న వార్తలను సైతం డబ్ల్యూహెచ్ఓ ఖండించింది.

English summary
The latest news is that China has warned the WHO not to let the corona intensify, as the corona is booming in China. This was revealed by the US intelligence agency Central Intelligence Agency. China has been baffled even though the WHO has hoped to declare a health emergency when Corona is booming in China. However, the CIA has revealed that China threatened the WHO to stop their cooperation with the World Health Organization if the matter was exposed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X