వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ వెనక్కు తగ్గకపోతే యుద్దం తప్పదు: చైనా మీడియా

సిక్కిం రాష్ట్ర సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై వెనక్కు తగ్గకపోతే భారత్ సైనిక చర్యను ఎదుర్కోవాల్సిఉంటుందని చైనా అధికారిక పత్రిక హెచ్చరించింది. భారత్ చైనా ల మధ్య చెలరేగిన సమస్య చిలికి చిలికి

By Narsimha
|
Google Oneindia TeluguNews

బీజింగ్:సిక్కిం రాష్ట్ర సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై వెనక్కు తగ్గకపోతే భారత్ సైనిక చర్యను ఎదుర్కోవాల్సిఉంటుందని చైనా అధికారిక పత్రిక హెచ్చరించింది. భారత్ చైనా ల మధ్య చెలరేగిన సమస్య చిలికి చిలికి గాలి వానగా మారి యుద్దానికి దారితీస్తోందని పేర్కొంది.

హిందూ మహసముద్రంలో చైనా యుద్ద ట్యాంకులు, యుద్దమేనా? హిందూ మహసముద్రంలో చైనా యుద్ద ట్యాంకులు, యుద్దమేనా?

గత చరిత్ర నేర్పిన పాఠాలను పునరుద్ఘాటిస్తూ సాధ్యమైనంతవరకు శాంతియుత మార్గంలోనే సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపింది. భారత్ మాట వినకపోతే...సైనిక చర్య తప్పదన్నారు. అమెరికా దగ్గర గప్పాలు కొట్టేందుకే భారత్ చైనాను రెచ్చగొడుతోందని వ్యాఖ్యానించింది.

China Will Have To Take 'Military Way' If India Doesn't Listen: Chinese Media

చైనా కంటే భారత్ ఏమంత గొప్ప శక్తివంతమైన దేశమేమీ కాదని షాంఘై అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ లో రీసెర్చ్ స్కాలర్ గా పనిచేస్తున్న హు జియాంగ్ అనే వ్యక్తి వ్యాఖ్యానించారు.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈ విషయం తెలుసునని అందుకే ఆయన ఇరుదేశాలతో సత్సంబంధాలను కొనసాగించారని ఆ పత్రిక పేర్కొంది.

భారత్, చైనాను తన విరోధిగా భావిస్తున్నా...చైనా మాత్రం అదేం పట్టించుకోకుండా ముందుకుసాగిపోతోందన్నారు. భారత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని హు అన్నట్టు గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఏం మాట్లాడకుండా ఉంటేనే ఇండియాకు మంచిదని హు సలహ ఇచ్చినట్టు వివరించింది ఆ పత్రిక.

English summary
China would be forced to use a "military way" to end the standoff in the Sikkim sector if India "refuses to listen" to it, a Chinese expert has warned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X