• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా తెంపరితనం: గాల్వన్ వ్యాలీ ఘర్షణలపై నిజాలు..ఆ బ్లాగర్‌ జైలుపాలు

|

బీజింగ్: గత ఏడాది భారత్-చైనా మధ్య లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణానికి దారి తీసిన గాల్వన్ వ్యాలీ ఘర్షణల అంశం.. తాజాగా మరోసారి తెర మీదికి వచ్చింది. ఈ ఘర్షణలకు సంబంధించిన వాస్తవ సమాచారాన్ని ప్రజలకు చేర వేసిన ఓ టాప్ బ్లాగర్‌కు చైనా న్యాయస్థానం కారాగార శిక్షను విధించింది. ఈ మేరకు తీర్పు వెలువడించింది. గాల్వన్ వ్యాలీ ఘర్షణల్లో వీరమరణం పొందిన సైనికులను అవమానించారనే కారణంతో ఆ బ్లాగర్‌కు ఎనిమిది నెలల జైలుశిక్షను విధించినట్లు పేర్కొంది. ఆయన చర్య క్రిమినల్ చట్టాలను ఉల్లంఘించినట్లుగా భావిస్తున్నట్లు తెలిపింది.

  Coronavirus In India: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల !
   10 రోజుల్లోగా క్షమాపణ చెప్పాలంటూ..

  10 రోజుల్లోగా క్షమాపణ చెప్పాలంటూ..

  వీరమరణం పొందిన సైనికులను అవమానించేలా వ్యాఖ్యానించినందుకు 10 రోజుల్లోగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కూడా న్యాయస్థానం ఆయనను ఆదేశించింది. న్యూస్ పోర్టల్స్, సోషల్ మీడియా, జాతీయ మీడియా ద్వారా బహిరంగ క్షమాపణ చెప్పాల్సి ఉంటుందనే షరతును విధించింది న్యాయస్థానం. చైనాలో క్రిమినల్ చట్టాలను సవరించిన తరువాత.. అమరులైన సైనికులను అవమానించారనే కారణంతో ఓ వ్యక్తి అరెస్టు కావడం ఇదే తొలిసారి.

  మాజీ రిపోర్టర్..

  మాజీ రిపోర్టర్..

  ఆయన పేరు- క్వియు ఝైమింగ్. చైనాలో ఇంటర్‌నెట్ సెలెబ్రిటీ. టాప్ బ్లాగర్. ల్యాబిక్సియోక్వియు పేరుు మీద ఆన్‌లైన్ బ్లాగ్‌ను నడిపిస్తోన్నారు. దీనికి మూడు మిలియన్ల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఎకనమిక్ అబ్జర్వర్ వీక్లీ మాజీ రిపోర్టర్ కూడా. గాల్వన్ వ్యాలీలో గత ఏడాది భారత జవాన్లు, చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాల మధ్య గత ఏడాది జూన్ 15-16 తేదీల్లో ప్రాణాంతక భౌతికదాడులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో భారత్ తరఫున 20 మంది సైనికులు అమరులయ్యారు.

  పెద్ద ఎత్తున విమర్శలు..

  పెద్ద ఎత్తున విమర్శలు..

  పీఎల్‌ఏ బలగాలు కూడా పెద్ద సంఖ్యలో వీరమరణం పొందారంటూ అప్పట్లో క్వియు ఝైమింగ్.. తన బ్లాగ్‌లో రెండు పోస్టులు పెట్టారు. ప్రభుత్వం చెబుతోన్న లెక్కల కంటే ఎక్కువ మందే సైనికులు అమరులై ఉండొచ్చని తాను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. చైనా ప్రభుత్వం దీన్ని తప్పు పట్టింది. తోటి ప్రజల జాతీయ భావాలను కించపరిచేలా ఉన్నాయంటూ అప్పట్లో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన చర్యలు దేశభక్తుల్లో విషాన్ని నింపేదిగా ఉందంటూ ఝైమింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. క్రిమినల్ చట్టాలను ఉల్లంఘన కింద పరిగణించారు.

  ఎనిమిది నెలల జైలు..

  ఎనిమిది నెలల జైలు..

  నిజానికి- ఈ ఏడాది మార్చిలో ఝైమింగ్ మీడియా ముందుకొచ్చారు.చైనా అధికారిక బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ ద్వారా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు. గాల్వన్ వ్యాలీ ఘర్షణలకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు, పోస్ట్ చేసిన సమాచారం పట్ల సిగ్గుపడుతున్నానని అన్నారు. గత ఏడాదే ఆయనను అరెస్ట్ చేసింది. చైనా తూర్పు ప్రాంతంలోని ఝియాంగ్సు ప్రావిన్స్‌లో గల నాన్జింగ్ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టింది. పలు దఫాలుగా ఈ కేసుపై విచారణ చేపట్టిన ఆ కోర్టు.. తాజాగా తన తీర్పును వెలవడించింది. ఝైమింగ్‌కు ఎనిమిది నెలల జైలుశిక్ష విధించింది. దేశ ప్రజలకు క్షమాపణ కోరాలని ఆదేశించింది.

  English summary
  Qiu Ziming, A popular Chinese blogger, detained earlier this year for his comments regarding military casualties of Galwan valley clash with India, has been sentenced to eight months in prison.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X