వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగిరెగిరి తన్నిందిగా.. పరుగులు పెట్టించిందిగా..! (వీడియో)

|
Google Oneindia TeluguNews

బీజింగ్‌ : పన్నెండు సంవత్సరాల నుంచి బందీగా ఉన్న ఓ చింపాంజీకి ఒక్కసారిగా స్వాతంత్ర్యం వచ్చినట్లైంది. ఎన్‌క్లోజర్‌లో బందీగా ఉన్న చింపాంజీ బయటకు వచ్చి నానా రచ్చ చేసింది. విజిటర్స్‌ను పరుగులు పెట్టించడమే కాకుండా జూ సిబ్బందిని ఎగిరెగిరి తన్నింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు చింపాంజీ యాక్షన్ వెలుగుచూసింది.

తూర్పు చైనాలోని హెఫీ వైల్డ్‌లైఫ్‌ పార్కులో 12 సంవత్సరాల వయస్సున్న యాంగ్ యాంగ్ అనే చింపాంజీ హల్‌చల్ చేసింది. బోనులో నుంచి బయటపడి బీభత్సం స‌ృష్టించింది. వాంగ్ యాంగ్ ఇష్టమొచ్చినట్లుగా పరుగులు పెట్టడంతో సందర్శకులు భయపడ్డారు. దాని బారి నుంచి తప్పించుకునేందుకు వారు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

Chinese Chimpanzee Escapes Zoo Enclosure Kicks Keeper

చింపాంజీ తీరుతో బేజారైన విజిటర్స్ జూ సిబ్బందిని నిలదీశారు. దాన్ని కట్టడి చేయడంలో విఫలమయ్యారంటూ మండిపడ్డారు. దాంతో వారు చేసేదేమీ లేక పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు తొలుత విజిటర్స్‌ను పార్క్ నుంచి బయటకు పంపించేశారు. ఆ తర్వాత చింపాంజీని పట్టుకునే ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సందడంతా చూసి అది అక్కడే ఉన్న ఓ షెడ్డు రూఫ్ పైకి చేరింది.

భూ తగదా కాటేసిందా.. పార్ట్‌నర్ చంపేశాడా.. రాం ప్రసాద్ మర్డర్ కేసులో ట్విస్టేంటి?భూ తగదా కాటేసిందా.. పార్ట్‌నర్ చంపేశాడా.. రాం ప్రసాద్ మర్డర్ కేసులో ట్విస్టేంటి?

చివరకు ట్రాంక్విలైజర్ ద్వారా మత్తు ఇంజెక్ట్ చేశారు. అనంతరం దాన్ని పట్టుకుని మళ్లీ బోనులోకి చేర్చారు. సదరు చింపాంజీ ఎన్‌క్లోజర్ నుంచి బయటకు వచ్చి పరుగులు పెట్టడం, ఎగిరెగిరి తన్నడం చూసి విజిటర్స్ చాలా భయపడ్డారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. అదలావుంటే అసలు ఆ చింపాంజీ బయటకెలా వచ్చిందని జూ సిబ్బందిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

English summary
Chimpanzee escaped from enclsoure in Chinas Hefei Wildlife Park on Friday morning, causing much confusion and chaos as he charged at visitors and even kicked an employee to the ground. The 12 year old male chimp, named Yang Yang, was spotted running on the roof and evading capture for some time before he was shot with a transquiliser dart and returned to his cage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X