వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరీరంపై పుండ్లు: చైనాలో పుట్టుకొచ్చిన కొత్త వైరస్: సరిహద్దులూ దాటేసింది: పొరుగుదేశంపై పంజా

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో మరో వైరస్ పుట్టుకొచ్చింది. ఇప్పటికే ప్రపంచాన్ని క్రమక్రమంగా కొరుక్కుతింటోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌కు జన్మనిచ్చిన చైనాలో కొత్తగా మరో మహమ్మారి భయానకంగా విస్తరిస్తోంది. దాని పేరే బుబోనిక్ ప్లేగ్. చైనా ఉత్తర ప్రాంతంలో రెండురోజుల కిందట వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి.. ఇప్పటికే ఆ దేశ సరిహద్దులను దాటుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పొరుగునే ఉన్న మంగోలియాపై పంజా విసురుతోంది.

Recommended Video

Bubonic Plague in China: Risk Of Spreading చైనీయుల ఆ అలవాటే బుబోనిక్ ప్లేగ్ వ్యాప్తికి ప్రధాన కారణం!

సొంత జిల్లాకు జగన్..రెండు రోజులు అక్కడే: వైఎస్ జయంతి సహా: బిజీ షెడ్యూల్: ట్రిపుల్ ఐటీకిసొంత జిల్లాకు జగన్..రెండు రోజులు అక్కడే: వైఎస్ జయంతి సహా: బిజీ షెడ్యూల్: ట్రిపుల్ ఐటీకి

జ్వరం.. తలనొప్పి

జ్వరం.. తలనొప్పి

చైనా ఉత్తర ప్రాంతంలోని బయన్నూర్‌లో తొలిసారిగా బుబోనిక్ ప్లేగ్ కేసు వెలుగులోకి వచ్చింది. జ్వరం, తలనొప్పి, చలితో బాధపడుతోన్న ఓ వ్యక్తి శనివారం బయన్నూర్‌లోని ఆసుపత్రిలో చేరాడు. అతనికి డాక్టర్లు నిర్వహించిన పరీక్షల సందర్భంగా బుబోనిక్ ప్లేగ్ విషయం బహిర్గతమైంది. అతనికి బుబోనిక్ ప్లేగ్‌ సోకినట్లు నిర్ధారించారు. ఈ ప్లేగ్ ఇతరులకు సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు వెల్లడించారు. అతని కుటుంబ సభ్యులను ఆసుపత్రిలో చేర్చారు. వందమందికి పైగా ఈ ప్లేగ్ లక్షణాలతో బాధపడుతున్నట్లు ధృవీకరించారు.

శరీరంపై పుండ్లు ఏర్పడితే.. ఇక అంతే

శరీరంపై పుండ్లు ఏర్పడితే.. ఇక అంతే

ఈ వైరస్‌ను కనుగొనేటప్పటికే దాని వ్యాప్తి ఆరంభమైందని బయన్నూర్ స్థానిక ప్రభుత్వాధికారులు అనుమానిస్తున్నారు. అందుకే ఒకేసారి వందమందికి పైగా ఈ లక్షణాలతో ఆసుపత్రిలో చేరారని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని లెవల్‌-3 ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. స్థానికులను అప్రమత్తం చేశారు. ఈ వైరస్ సోకిన తరువాత శరీరంపై పుండ్లు ఏర్పడే ప్రమాదం ఉందని డాక్టర్లు వెల్లడించారు. శరీరంపై పుండ్లు ఏర్పడటాన్ని చివరిదశగా చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, చలి, గొంతునొప్పి అనంతరం శరీరంపై పుండ్లు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఆసుపత్రిలో చేరాలని హెచ్చరించారు.

ఎలుకల్లో ఉండే బ్యాక్టీరియా వల్ల

ఎలుకల్లో ఉండే బ్యాక్టీరియా వల్ల

ఎలుకల్లో ఉండే ఎర్సీనియా పెస్టిన్ అనే బ్యాక్టీరియా ద్వారా బుబోనిక్ ప్లేగ్ పుట్టుకొచ్చిందని బయన్నూర్ డాక్టర్లు వెల్లడించారు. ఇదే తరహా బ్యాక్టీరియా కొన్ని పురుగుల్లోనూ ఉంటుందని చెబుతున్నారు. బయన్నూర్‌లో మర్మోట్ జాతికి చెందిన ఎలుకలను తిన్న వారే ఈ బుబోనిక్ ప్లేగ్ బారిన పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎలుకలు తినడం చైనీయుల అలవాటు. ఇప్పుడు ఆ అలవాటే బుబోనిక్ ప్లేగ్ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం కావచ్చనే భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి.

మంగోలియాలో వ్యాప్తి..

మంగోలియాలో వ్యాప్తి..

చైనా సరిహద్దులను ఆనుకుని ఉన్న మంగోలియాలో బుబోనిక్ ప్లేగ్ వ్యాప్తి చెందింది. మంగోలియాలోని ఖోవ్డ్ ప్రావిన్స్‌లో ఈ వ్యాధి లక్షణాలు పలువురు ఆసుపత్రులపాలైనట్లు గ్ఝిన్‌హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. 27 సంవత్సరాల వయస్సున్న ఓ వ్యక్తి, 17 సంవత్సరాల వయస్సున్న అతని సోదరుడు ఖోవ్డ్ ప్రావిన్స్‌లో ఆసుపత్రిలో చేరారు. ఆ ఇద్దరూ మర్మోట్ జాతికి చెందిన ఎలుకలను తిన్నారని తేలింది. దీనితో ఈ రకం జాతి ఎలుకలను తినకూడదంటూ స్థానిక అధికారులు ఆదేశాలను జారీ చేశారు. దీన్ని నివారించడానికి అధికారులు లెవెల్-3 ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.

చైనా నుంచి పుట్టుకొచ్చిన మూడో మహమ్మారి

చైనా నుంచి పుట్టుకొచ్చిన మూడో మహమ్మారి

ప్రపంచాన్ని ఆక్రమించుకున్న కరోనా వైరస్‌ చైనాలోనే పుట్టుకొచ్చినట్లు అనుమానిస్తోన్న విషయం తెలిసిందే. హ్యుబే ప్రావిన్స్‌లోని వుహాన్‌లో గత ఏడాది డిసెంబర్‌లో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజుల కిందటే జీ4 అనే మరో వైరస్‌ను కూడా డాక్టర్లు గుర్తించారు. జీ4 హెచ్1ఎన్1 వైరస్ ఇప్పుడిప్పుడే చైనాలో వ్యాప్తి చెందుతోంది. అదే సమయంలో చైనా ఉత్తర ప్రాంతంలో కొత్తగా బుబోనిక్ ప్లేగ్ పుట్టుకునిరావడం పట్ల ప్రపంచ దేశాలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి.

English summary
A city in northern China on Sunday sounded an alert after a suspected case of bubonic plague was reported, according to official media. Bayannur, Inner Mongolia Autonomous Region, announced a level III warning of plague prevention and control, state-run People's Daily Online reported. The suspected bubonic plague case was reported on Saturday by a hospital in Bayannur. The local health authority announced that the warning period will continue until the end of 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X