వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతుల కొరత: ‘ఒక భార్యకు అనేక మంది భర్తలు’

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ప్రాచీన కాలంలో అమలులో ఉన్న బహు భర్తృత్వం ఇప్పుడు చైనాలో అమలయ్యేలా ఉంది. ఎందుకంటే అక్కడ రోజు రోజుకు బ్రహ్మచారులు పెరుతుండగా వారికి తగ్గట్లుగా యువతుల సంఖ్య పెరగడం లేదు. దీంతో చైనాలో ఎక్కువమంది బ్రహ్మచారులుగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బహు భర్తృత్వం ప్రతిపాదనపై అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.

కాగా, 2020 నాటికి చైనాలో బ్రహ్మచారుల సంఖ్య మూడు కోట్లకు చేరే అవకాశముందని అంచనా వేస్తున్నారు. బ్రహ్మచారుల సంఖ్యకు తగినట్లుగా యువతులు లేకపోవడం చైనాలో ప్రధాన సమస్యగా మారింది.

‘ఒక భార్య.. అనేక మంది భర్తలు' అనే అంశాన్ని ఆమోదించడమే చైనాలో బ్రహ్మచారుల సమస్యకు సరైన పరిష్కారమని జీజింగ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థికశాస్త్ర విభాగం ఫ్రొఫెసర్ జీ జూషి ప్రతిపాదన చేశారు. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి ఇద్దరు పురుషులు వివాహం చేసుకునే విధంగా చట్టబద్ధత కల్పించడం మరో మార్గమని ఆయన సూచించారు.

Chinese Economist Suggests Men Should Share Wives To Solve China’s Gender Imbalance

తన ప్రతిపాదనను తన మూడు బ్లాగుల్లో పోస్ట్ చేశారు. ఫ్రొఫెసర్ జీ జూషి చెప్పిన కొత్త భాష్యం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవ్వడమే కాకుండా పెద్ద దుమారం రేగింది. ఈ ప్రతిపాదన విస్తృతంగా చర్చకు దారి తీసింది. దీంతో ఈ పోస్ట్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించారు.

తాను ఆర్థిక కోణంలో ఈ సమస్యను చూశానని, ధరల పెరిగినపుడు వస్తువులు సంపన్నులకే అందుబాటులో ఉంటాయని, పేదవారికి లభించడం కష్టం ఉంటుందని తెలిపారు. అదే మాదిరిగా యువతల కొరత ఉండి.. బ్రహ్మచారుల సంఖ్య ఎక్కువగా ఉన్నపుడు స్త్రీల విలువ పెరుగుతుందన్నారు.

ఈ వ్యత్యాసాన్ని తగ్గించడానికి ఒకే మహిళను ఇద్దరు వ్యక్తులు వివాహామాడితే తప్పేంటని ప్రశ్నించారు. నైతిక విలువలు మంటగలిపాడంటూ ఈ ప్రతిపాదన చేసిన జీ జూషీకి పెద్ద ఎత్తున్న బెదిరింపులు ఎదురయ్యాయి.

ఈ ప్రతిపాదన చేసింది ఓ మనిషేనా అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. అయితే ప్రభుత్వం ఆయన సూచనను పరిగణలోకి తీసుకుంటుందా? లేక సమస్య పరిష్కారానికి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా అనేది వేచి చూడాలి.

English summary
Chinese economist, Xie Zuoshi, has shocked many people after he suggested polygamy as a solution to China's rising problem of gender imbalance. Zuoshi, who is an economics professor at Zheijing University of Finance and Economics sparked a digital backlash after he advocated polyandry in his blog post, which has now been removed as reported by The New York Times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X