వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడ్ని వెతుక్కుంటూ దేశం దాటిన ప్రియురాలు

|
Google Oneindia TeluguNews

బీజింగ్: ప్రియుడ్ని వెతుక్కుంటూ దేశమే దాటిపోయింది ఓ ప్రియురాలు. దేశం కాని దేశంలో 20 రోజులపాటు ప్రియుడి జాడకోసం నిర్విరామంగా వెతుకుతోంది. వివరాల్లోకి వెళ్తే... చైనాకు చెందిన తీన్ డామి అలియాస్ డాలీ అనే 23ఏళ్ల యువతి ఓ మెడికల్ కళాశాలలో క్లర్క్‌గా పని చేస్తోంది.

అదే కళాశాలలో మెడిసిన్ అభ్యసిస్తున్న పాకిస్థాన్ యువకుడు అమీన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియుడి ఫీజు కోసం ఉన్న ఇంటిని కూడా అమ్మేసింది డాలీ.

కాగా, నెల రోజుల క్రితం డాలీకి చెప్పకుండానే అమీన్ పాకిస్ధాన్ వెళ్లిపోయాడు. దీంతో ప్రియుడి చిరునామాను వెతుక్కుంటూ డాలీ పాకిస్థాన్ చేరుకుంది.

Chinese girl pursuing Pakistani lover reached Muzaffargarh

గత 20 రోజులుగా ఇస్లామాబాద్, ముజఫర్ గఢ్ ప్రాంతాలన్నీ గాలిస్తోంది. ఆమె తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు విచారించడంతో ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో ఆమెను చైనా దౌత్యకార్యాలయానికి అప్పగించారు పాక్ పోలీసులు.

అయితే ప్రియుడిని కలిసిన తరువాతే తాను చైనాకు వెళ్తానని, అంతవరకు పాక్ వీడే ప్రసక్తి లేదని డాలీ చెబుతోంది. కాగా, అమీన్ కుటుంబ సభ్యులను సంప్రదించగా అమీన్ చైనాలోనే ఉన్నాడని చెప్పడం విశేషం.

అయితే, తనను కలిసేందుకు అమీన్ ఇష్టపడటం లేదని తెలుసుకున్న డాలీ.. మోసం చేశాడని కన్నీటి పర్యాంతమైంది. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ.. ఈ ప్రేమికుల మధ్య మాత్రం ప్రేమపూర్వక సంబంధాలు కొనసాగడం లేదని తెలుస్తోంది.

English summary
A Chinese chick, whose allegedly boyfriend didn’t fulfil his vow to marry her, reached Muzaffargarh and was taken into protective custody by district police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X