కూలిన చైనా యుద్ధ విమానం.. ఆదేశం పనేనా...సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
చైనా ఆకృత్యాలు మితిమీరిపోతున్నాయి. ఇప్పటికే భారత సరిహద్దులో తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న డ్రాగన్ కంట్రీ తాజాగా తైవాన్ పై కన్నేసినట్లు కనిపించింది. చైనాకు చెందిన సుఖోయ్ -35 యుద్ధ విమానాలు తైవాన్ గగనతలంలోకి అక్రమంగా చొరబడటంతో తైవాన్ ధీటుగా సమాధానం ఇచ్చినట్లు తైవాన్ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
It’s Big & Bold
— Major Surendra Poonia (@MajorPoonia) September 4, 2020
Chinese fighter Jet shot down by Taiwan....
Now China will say
It got crashed due to tech glitch or it’s not true pic.twitter.com/DZ6oxHQAmh
తైవాన్ గగనతంలోకి నిబంధనలు ఉల్లంఘించి వచ్చిన చైనా సుఖోయ్ యుద్ధ విమానాన్ని తైవాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం కూల్చినట్లు ఆదేశ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. జూయిష్ ప్రెస్ అనే పత్రిక కథనం ప్రకారం గ్వాంగ్జీ ప్రాంతంలో చైనా సుఖోయ్ యుద్ధ విమానం కూలినట్లు తెలుస్తోంది. దక్షిణ చైనాలోని కోస్తా తీరంలో ఈ ప్రాంతం ఉండగా వియత్నాంతో సరిహద్దు కలిగి ఉంది.

అయితే జరిగిన ఈ ఘటన గురించి కేవలం సోషల్ మీడియాలో మాత్రమే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తలపై సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న వీడియోపై ఇంకా ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు.ఇక ఈ ఫైటర్ జెట్ నివాస ప్రాంతంకు సమీపంలోని బహిరంగ ప్రాంతంలో కూలినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం తైవాన్ మిలటరీ వర్గాలే కూల్చాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ... సాంకేతిక లోపంతో యుద్ధ విమానం ఏమైనా కూలిందా అన్న కోణంలో కూడా చర్చ జరుగుతోంది. 1991లో తొలిసారిగా రష్యా నుంచి సుఖోయ్ యుద్ధ విమానాలను చైనా కొనుగోలు చేసింది. ఇక అప్పటి నుంచే ఈ యుద్ధ విమానాలను వినియోగించి భారత సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు దిగుతోంది డ్రాగన్ కంట్రీ.
కొద్ది రోజుల క్రితం జే-20 యుద్ధ విమానాలను భారత సరిహద్దుల వద్ద చైనా మోహరించి ఉందనే వార్తలు వచ్చాయి. టిబెట్ వద్ద ఉన్న హోటాన్ ఎయిర్‌బేస్ వద్ద ఈ యుద్ధ విమానాలను చైనా మోహరించిందనే వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే బీజేపీ నేత ఎంపీ సుబ్రహ్మణియన్ స్వామి కూడా ఓ ట్వీట్ చేశారు. టిబెట్ సరిహద్దులో రష్యా తయారు చేసిన సుఖోయ్ యుద్ధ విమానాలను టిబెట్‌లో చైనా మోహరించిందని స్వామి ట్వీట్ చేశారు.