వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చేస్తే మీకే నష్టం,మేం కూడా అలానే: చైనాకు భారత్ హెచ్చరిక

చైనా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే కొన్ని వస్తువులపై యాంటీ డంపింగ్‌ డ్యూటీలను విధించాలన్న భారత్‌ నిర్ణయంపై చైనా మండిపడింది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే కొన్ని వస్తువులపై యాంటీ డంపింగ్‌ డ్యూటీలను విధించాలన్న భారత్‌ నిర్ణయంపై చైనా మండిపడింది.

భారత్ సిద్ధంగా ఉండాలని హెచ్చరిక

భారత్ సిద్ధంగా ఉండాలని హెచ్చరిక

అధికార పత్రిక గ్లోబల్‌టైమ్స్‌‌లో ఓ కథనం వచ్చింది. చైనాకు చెందిన పెట్టుబడిదారులు భారత్‌లో పెట్టుబడులు పెట్టేముందు ఆలోచించాలని సూచనలు చేసింది. ఇలాంటి చర్యలకు దిగితే జరిగే పరిణామాలకు భారత్‌ సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.

మేం కూడా అలానే చేస్తాం

మేం కూడా అలానే చేస్తాం

భారత్‌ నుంచి చైనాకు దిగుమతి అయ్యే వస్తువులపై తాము కూడా అదనపు సుంకాలు విధిస్తామని తెలిపింది. భారత్ చర్యలతో చైనాకు పెద్దగా నష్టం ఉండదని, చైనాకు భారత్‌ ఎగుమతులు 12.3 శాతం తగ్గగా అదే సమయంలో చైనా దిగుమతులు 2 శాతం పెరిగాయని పేర్కొంది.

భారత్‌కే తీవ్ర ప్రమాదం

భారత్‌కే తీవ్ర ప్రమాదం

మన దేశంలో చైనా దిగుమతులు పెరుగుతుండగా అదే సమయంలో ఆ దేశానికి మన నుంచి వెళ్లే ఎగుమతులు తగ్గుతున్నాయి. వాణిజ్యపరంగా ఆంక్షలు విధంచడం ద్వారా చైనాతో వాణిజ్యయుద్ధంతో భారత్‌ సిద్ధమయిందని అయితే దీనితో చైనాకు కొద్దిగా నష్టం వాటిల్లవచ్చని కానీ భారత్‌కు మాత్రం తీవ్ర నష్టం జరిగే ప్రమాదముందని హెచ్చరించింది.

నష్టపోతారని..

నష్టపోతారని..

భారత్‌కు వాణిజ్య లోటు పెరగడంతో ఇబ్బందులు తప్పవని పేర్కొంది. గత కొన్ని రోజులుగా సిక్కిం, భూటాన్‌, చైనాల సరిహద్దుల్లోని ట్రైజంక్షన్‌లో చైనా, భారత్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉద్రిక్తతలు ద్వైపాక్షిక వాణిజ్యానికి చేరాయి. భారత్‌లో చైనా సంస్థలు పెట్టుబడులు పెట్టకపోవడంతో నష్టపోయేది భారత్‌ అని చైనా పత్రిక పేర్కొంది.

ఉద్యోగ కల్పన తగ్గుతుందని

ఉద్యోగ కల్పన తగ్గుతుందని

భారత్‌లో చైనా వస్తువులను బహిష్కరించాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని మరో పత్రిక ఖండించింది. ఇలాంటి ప్రచారాలతో అంతిమంగా భారత్‌ నష్టపోతుందని అభిప్రాయపడింది. భారత్‌లో ఉద్యోగ కల్పన కూడా తగ్గుతుందని పేర్కొంది.

English summary
India should not have imposed anti-dumping duties on Chinese products as it could trigger a trade war between the two countries, according to the Chinese media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X