వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా దురాగతం.. భారతీయ విద్యార్థులకు బెదిరింపులు.. బలవంతపు క్షమాపణలు.. అది ఆత్మహత్యేనంటూ..

|
Google Oneindia TeluguNews

ఇండియా పట్ల కిరాతకంగా వ్యవహరిస్తోన్న చైనా మరో దురాగతానికి పాల్పడింది. సరిహద్దులో జవాన్లను దారుణంగా హత్య చేసిన డ్రాగన్.. తాజాగా భారతీయ విద్యార్థులపై బెదిరింపులకు దిగుతున్నది. చైనా నెటిజన్లు కూడబలుక్కొని ''ఇండియన్ స్టూడెంట్స్ గో బ్యాక్''నినాదాన్ని లంకించుకున్నారు. పొరుగుదేశాలపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ మౌత్ పీస్ 'గ్లోబల్ టైమ్స్'.. ఇండియాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతోన్న 'బైకాట్ చైనా ప్రాడక్ట్స్' ఉద్యమం ఆత్మహత్య లాంటిదంటూ శాపనార్థాలు పెట్టింది.

జిన్ పింగ్‌పై చైనా ప్రజల ఆగ్రహం.. గాల్వాన్‌లో హింస తర్వాత మళ్లీ చర్చలు.. భారత్ కొత్త స్ట్రాటజీజిన్ పింగ్‌పై చైనా ప్రజల ఆగ్రహం.. గాల్వాన్‌లో హింస తర్వాత మళ్లీ చర్చలు.. భారత్ కొత్త స్ట్రాటజీ

టిక్‌టాక్‌లో కామెంట్ల వివాదం..

టిక్‌టాక్‌లో కామెంట్ల వివాదం..

ఇండియాలో టిక్ టాక్ పేరుతో నడిచే యాప్ కు ఒరిజినల్ చైనీస్ వెర్షన్ అయిన డూయిన్ యాప్ లో చోటుచేసుకున్న కామెంట్ల వివాదం చినికిచినికి గాలివానలా తయారైంది. ఓ భారతీయ విద్యార్థిని కార్నర్ చేసిన చైనీస్ నెటిజన్లు.. దేశం విడిచివెళ్లాలంటూ బెదిరింపులకు దిగారు. యూనివర్సిటీ యాజమాన్యం, ప్రభుత్వాధికారులు సైతం నెటిజన్ల డిమాండ్ కు వంతపాడటం గమనార్హం.

తను ‘జియాంగ్ షూ' స్టూడెంట్..

తను ‘జియాంగ్ షూ' స్టూడెంట్..

ఉన్నత చదువుల కోసం చైనా వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య సుమారు 25వేలపైనే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి. వాళ్లలో 80 నుంచి 90 శాతం మంది మెడిసిన్ విద్యార్థులే. కరోనా విజృంభణ తర్వాత వైరస్ జన్మస్థలమైన వూహాన్ నుంచి దాదాపు 700 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగిరావడం తెలిసిందే. ఇప్పుడు భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో అక్కడ వివిధ యూనివర్సిటీల్లో చదువుకుంటోన్న మనవాళ్లు ఒత్తిడి ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. తాజాగా బెదిరింపులు ఎదుర్కొన్న భారతీయ విద్యార్థి జియాంగ్ షూ యనివర్సిటీకి చెందినవాడని వెల్లడైంది.

మోదీకి చైనా జేజేలు.. మాతో పెట్టుకోలేరు.. గాల్వాన్‌పై ప్రధాని ప్రకటన భేష్.. పాక్ అయ్యింటే వేరే సీన్..మోదీకి చైనా జేజేలు.. మాతో పెట్టుకోలేరు.. గాల్వాన్‌పై ప్రధాని ప్రకటన భేష్.. పాక్ అయ్యింటే వేరే సీన్..

బలవంతంగా క్షమాపణలు..

బలవంతంగా క్షమాపణలు..

టిక్ టాక్ చైనీస్ వెర్షనైన డూయిన్ లో ఓ చైనా పౌరుడికి భారతీయ విద్యార్థికి మధ్య వాగ్వాదం నడిచిందని, ఇద్దరూ తీవ్రంగానే వాదులాడుకున్నారని, ఒక దశలో అవతలి వ్యక్తి పేరును ‘పిగ్'అని సంబందోధిస్తూ.. ‘చైనీస్ పిగ్' అంటూ మనవాడు కామెంట్ పెట్టాడు. అంతే, నువ్వు మాదేశాన్ని తిడుతున్నావంటూ అవతలి వ్యక్తం రెచ్చిపోయాడు. భారతీయ విద్యార్థి కామెంట్ల స్క్రీన్ షాట్లు వెబో(చైనీస్ ట్విటర్)లో వైరల్ అయ్యాయి. ‘వెంటనే చైనా నుంచి వెళ్లిపో'మంటూ బెదిరింపులు వచ్చాయి. వివాదం పెద్దది కావడంతో వర్సిటీ యాజమాన్యం సదరు భారతీయ విద్యార్థి చేత బలవంతంగా క్షమాపణలు చెప్పించింది.

అయినా వదలకుండా..

అయినా వదలకుండా..

చైనీస్ ను కించపర్చేలా కామెంట్లు చేసినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన భారతీయ విద్యార్థి.. తన డూయిన్ అకౌంట్ ను కూడా రద్దు చేసుకున్నాడు. అయినా కూడా అతనిపై వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మాత్రం శిక్ష సరిపోదంటూ వెబోలో మళ్లీ డిమాండ్ వ్యక్తమైంది. దీంతో తదుపరి చర్యలు తీసుకునే విధంగా విద్యార్థిపై దర్యాప్తు కొనసాగిస్తామని జియాంగ్ షూ వర్సిటీ అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఆ విద్యార్థి కేరళకు చెందినవారని, ఇంటిపేరు కదుక్కస్సెరి అని వెల్లడైంది.

Recommended Video

#IndiaChinaFaceOff : మొండికేస్తోన్న China..11 గంటల పాటు కొనసాగిన చర్చలు!
చైనాకు ఫరక్ పడదు..

చైనాకు ఫరక్ పడదు..

భారతీయ విద్యార్థిపై బెదిరింపుల వ్యవహారం అటుంచితే, భారత్ లో కొనసాగుతోన్న ‘బైకాట్ చైనా ప్రాడక్ట్స్' క్యాంపెయిన్ పై జిన్ పింగ్ సర్కారువారి పత్రిక భారీ ఎత్తున విషం చిమ్మింది. కరోనా సందర్భంలో మనం చైనా నుంచి వెంటిలేటర్లు తెప్పించుకోవడాన్ని కూడా ప్రస్తావిస్తూ.. చైనాపై ఆధారపడటం తప్ప భారత్ కు సరైన సప్లై చైన్ లేదని, తక్కువ ధరలో లభించే చైనా వస్తువులను కాదనుకంటే.. అవే సరుకుల్ని నాలుగింతలు ఎక్కువ ధరకు ఇతర దేశాల నుంచి కొనుక్కోవాల్సి ఉంటుందని, ఇప్పటికే ఎగుమతులు, దిగుమతులు బాగా క్షీణించిన దశలో బైకాట్ నినాదం భారత్ కు ఆత్మహత్యలాంటిదేనంటూ ‘గ్లోబల్ టైమ్స్' రాసుకొచ్చింది. పైగా, చైనా మొత్తం ఎగుమతుల్లో భారత్ వాటా కేవలం 2 శాతమేనని, ఒకవేళ భారత్ బైకాట్ చేసినా తమపై పెద్దగా ఫరక్ పడదని చైనా అధికారిక పత్రిక పేర్కొనడం గమనార్హం.

English summary
Chinese Weibo users called Indian student despicable, and asked for him to immediately leave the country. Chinese state media claims Indian student from Kerala in China apologised after making comments on the country
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X