• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇంట్రెస్టింగ్ : మానవ మెదడుపై స్టడీ చేసేందుకు ఎలాంటి టెక్నాలజీ వినియోగిస్తున్నారు..?

|

భగవంతుడు మనిషికి ఇచ్చిన అవయవాల్లో మెదడు ఒకటి. మెదడుతో ఆలోచించే మనిషి ఎన్నో అద్భుతాలను కనుగొన్నాడు... సృష్టించాడు. తన మేధో శక్తి ఉపయోగించి అంతరిక్షంను కూడా చుట్టేసి వచ్చాడు. ప్రతి విషయం కనుగొనేందుకు మెదడు ఉపయోగించే మనిషి.. ఇప్పుడు అదే మెదడుపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు సిద్దమయ్యాడు. చైనాలోని పరిశోధకులు మెదడుపై లోతైన విశ్లేషణ చేసే యోచనలో ఉన్నారు.

3D సాంకేతికతతో మెదడుపై లోతైన విశ్లేషణ

3D సాంకేతికతతో మెదడుపై లోతైన విశ్లేషణ

ఆకాశంలో కొన్ని కోట్ల సంఖ్యలో నక్షత్రాలు చూస్తాం. అంతరిక్ష తరంగాలను గమనిస్తుంటాము. అయితే వాటిలోని అంతరంగం ఏమిటో మన మెదడుకు తట్టదు. ఎంత ఆలోచించినా వాటి వెనకున్న రహస్యం మాత్రం అంతుచిక్కదు. ఇవే సౌరకుటుంబాన్ని బలపరుస్తున్నాయి. వీటి నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే అంత సులభం కాదు. ఇలాంటి కఠినమైన కొన్ని సంఘటలను మనిషి మెదడు సులభంగా అర్థం చేసుకునేలా చేసేందుకు చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా మానవ మెదడుకు సంబంధించి క్లిష్టమైన న్యూరాన్లు, రక్తనాళాలను 3డీ సాంకేతికత వినియోగించి స్టడీ చేయనున్నారు.

 మెదడులోని ప్రతి అణువును స్టడీ చేయనున్న శాస్త్రవేత్తలు

మెదడులోని ప్రతి అణువును స్టడీ చేయనున్న శాస్త్రవేత్తలు

ఈ పరిశోధనల్లో భాగంగా మెదడులోని ప్రతి అణువును పరిశోధించి త్రీడీ ఫోటోలు తీసి స్టడీ చేస్తారు. ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో మెదడు పై భాగాన్ని మాత్రమే చూడగలే అవకాశం ఉందని అన్నారు శాస్త్రవేత్తలు. ప్రతి అణువును చూడలేమని చెప్పిన సైంటిస్టులు అసలు మెదడులోని న్యూరల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అనేదానిపై లోతైన పరిశోధనలు చేయనున్నట్లు తెలిపారు. ఈ పరిశోదనలు చేయడం ద్వారా మెదడుకు సోకే వ్యాధుల గురించి కూడా తెలుస్తుందని.... అప్పుడు ఎలాంటి చికిత్స అందించాలనే దానిపై కూడా స్పష్టత వస్తుందన్నారు హైనన్‌ యూనివర్శిటీకి చెందిన ఛీఫ్ సైంటిస్టు లుఓ కింగ్‌మింగ్. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అభివృద్ధి చేయొచ్చని చెప్పారు.

 మెదడు వ్యాధులకు చికిత్స కనుగొనే అవకాశం

మెదడు వ్యాధులకు చికిత్స కనుగొనే అవకాశం

మెదడులో ప్రతి నిత్యం నాడీ వ్యవస్త మారుతూ ఉంటుంది. మెదడు పనితీరును కనుగొనేందుకు ఇదో పెద్ద సవాల్‌గా తయారైంది. అయితే మెదడు పనిచేయడం మాత్రం సాధారణ కణాలపై ఆధారపడి ఉంటుందని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు శాస్త్రవేత్త లుఓ కింగ్‌మింగ్.అయితే పలు రకాల న్యూరాన్లు మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వాటి పనితీరును విశ్లేషించడం చేస్తామని చెప్పిన కింగ్‌మింగ్ మెదడుకు ఏదైనా వ్యాధి సోకితే వాటి చికిత్స కూడా తెలుస్తుందన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Why do some brains discover the laws of universe, while others create soul-stirring music or paintings? How is memory and consciousness generated?We can observe billions of stars and detect ripples in space, but we still barely understand our brains, which can fathom the universe.Their sophisticated structure and the number of neurons are only estimates.Now Chinese scientists are planning to draw the clearest yet three-dimensional map of the intricate neurons and blood vessels in the human brain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more