వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11వ అంతస్తు నుంచి దూకేసిన మహిళ.. పట్టుకుందామని ప్రయత్నించి...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బీజింగ్: ఏం జరిగిందో తెలియదుకానీ.. ఓ మహిళ తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ పదకొండో అంతస్తు నుంచి కిందికి దూకేసింది. ఆమె బాల్కానీలోకి రావడం, కిందకు దూకేందుకు ప్రయత్నించడాన్ని సెక్యూరిటీ గార్డు చూశాడు. ఆమెను కాపాడే ప్రయత్నంలో అతడూ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన చైనాలోని షాంక్సి ప్రావిన్స్‌లో గత అదివారం చోటుచేసుకుంది. అక్కడి ఓ అపార్ట్‌మెంట్‌లో లీ అనే 43 ఏళ్ల వ్యక్తి ఐదేళ్లుగా సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. బాల్కానీలోకి వచ్చి కిందికి దూకేందుకు ప్రయత్నిస్తున్న మహిళను చూశాడు.

దూకవద్దని కిందనుంచి అరుస్తున్నప్పటికీ పైనుంచి ఆమె ఒక్కసారిగా దూకేయడంతో పాపం ఆమెను పట్టుకోవాలనే ఉద్దేశంతో రెండు చేతులు పైకి చాచి పరిగెత్తాడు. కానీ పైనుంచి అతివేగంగా వచ్చిన ఆ మహిళ అతడిమీద పడడంతో ఆ బరువుకి అతడూ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించాడు.

ఈ ఘటనలో ఆ మహిళ కూడా మరణించింది. కుటుంబ కలహాల వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఎంతో ధైర్యంగా ఆ మహిళను పట్టుకునే ప్రయత్నంలో అసువులు బాసిన సెక్యూరిటీ గార్డు లీని బ్రేవరీ అవార్డుకు నామినేట్ చేశారు. అతడు పనిచేస్తున్న కంపెనీ కూడా అతడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ లీ కుటుంబానికి పరిహారం కింద కొంత మొత్తం డబ్బు కూడా అందించింది.

English summary
A security guard who died on Sunday while trying to prevent a woman from committing suicide has been nominated posthumously for a bravery award by the company that employed him. Li Guowu, a 43-year-old security guard, was on patrol outside a residential building in Xian, the capital of Shaanxi province, when he spotted a woman standing on a window ledge on the 11th floor. Surveillance video shows Li, a former soldier, shouting at her not to jump and positioning himself directly beneath the window in the hope of catching her. The woman falls on him, killing both on impact, Beijing Youth Daily reported on Wednesday. The company Li worked for has posthumously nominated him for a government award that is handed out to unusually brave citizens. The company has also offered Li’s family 5,000 yuan (US$755).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X