వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కౌంట్ డౌన్ స్టార్ట్: దూసుకొస్తున్న చైనా స్పేస్‌ల్యాబ్, కూలేది ఈ వారంలోనే, ఎక్కడంటే...

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బీజింగ్: అంతరిక్షంలో గతి తప్పి భూమి వైపు దూసుకొస్తోన్న చైనా స్పేస్‌ల్యాబ్ తియాంగోంగ్-1 ఈ వారంలో భూవాతావరణంలోకి ప్రవేశించనున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయితే భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఈ స్పేస్‌ల్యాబ్ చాలా వరకు మండిపోతుందని, దాని శకలాలు మాత్రం భూమిపై పడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.

ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 2 మధ్య ఎప్పుడైనా తియాంగోంగ్-1 భూమిపై కూలిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చైనా 2011లో తన తొలి అంతరిక్ష పరిశోధన కేంద్రమైన తియాంగోంగ్-1ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

Chinese Space Station Could Crash to Earth on Easter Weekend

ఐదేళ్లపాటు సేవలందించిన తర్వాత ఈ స్పేస్ ల్యాబ్ 2016లో గతి తప్పింది. 8.6 టన్నుల బరువున్న ఈ స్పేస్ ల్యాబ్ భూమి దిశగా కదలడం ప్రారంభించింది.

తియాంగోంగ్-1 శకలాలు మార్చి నెల మధ్యలో భూమిపై పడవచ్చని కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్ కార్పొరేషన్ తొలుత ప్రకటించగా, తాజాగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) మరింత కచ్చితమైన అంచనాలను ప్రకటించింది.

ఈఎస్‌ఏ అంచనాలను బట్టి స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, గ్రీస్ ప్రాంతాల్లో తియాంగోంగ్్-1 స్పేస్‌ల్యాబ్ శకలాలు పడవచ్చని, అవి కూడా 20-40 శాతం మాత్రమేనని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

English summary
China’s Tiangong-1 space station is predicted to enter Earth’s atmosphere sometime during Easter weekend, but the exact location of its re-entry remains a mystery. Its uncontrolled fall to Earth shares some similarities with the end of the Skylab space station in 1979; some of Skylab’s pieces rained down on rural Australia.The European Space Agency’s (ESA) Space Debris Office in Darmstadt, Germany, which issued the Tiangong-1 prediction, said the March 30 to April 2 window is “highly variable,” and it will not be possible to determine exactly where the space station will fall to Earth. However, the space station will re-enter somewhere between the latitudes of 43 degrees north and 43 degrees south, based on its current orbital inclination. “Areas above or below these latitudes can be excluded. At no time will a precise time/location prediction from ESA be possible," agency officials said in a statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X