వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక భయం లేదు: పసిఫిక్‌లో కూలిన చైనా స్పేస్ స్టేషన్ తియాంగాంగ్1

|
Google Oneindia TeluguNews

బీజింగ్‌: గత కొద్ది రోజులుగా నెలకొన్న ఆందోళనలకు తెరపడింది. విశ్వంలో అదుపుతప్పి తిరుగుతున్న చైనా అంతరిక్ష ప్రయోగ కేంద్రం తియాంగాంగ్‌-1 సోవమారం భూ వాతావరణంలోకి దూసుకొచ్చింది.

అయితే, దానికి సంబంధించిన శకలాలు దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలో పడిపోయినట్లు చైనా అధికారులు వెల్లడించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 8 టన్నుల బరువు గల ఈ స్పేస్‌ ల్యాబ్‌ శకలాలు ఎక్కువ శాతం గాల్లోనే మండిపోయినట్లు తెలిపారు.

Chinese Space Station in pictures: Tiangong-1 plummets to Earth in FIERY end

బీజింగ్‌ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8.15నిమిషాలకు దక్షిణ పసిఫిక్‌లోని మధ్య భాగంలో స్కైల్యాబ్‌ శకలాలు పడినట్లు వెల్లడించారు. తియాంగాంగ్‌-1ను 2011 సెప్టెంబర్‌లో ప్రయోగించారు. రెండేళ్ల పాటు సేవలు అందించేలా దీనిని రూపొందించారు.

2013 జూన్‌ నాటికి ఈ ల్యాబ్‌ ప్రధాన లక్ష్యాలన్నీ నెరవేరాయి. 2016 మార్చి నుంచి దీని సేవలు ఆగిపోయాయి. ఆ తర్వాత నియంత్రణ కూడా కోల్పోయింది. దీంతో అది భూమి మీద ఎక్కడ పడుతుందోనని ఆందోళన మొదలైంది.

అయితే, అది నేల మీద పడినా నష్టం కలిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని చైనా అధికారులు ముందుగానే స్పష్టం చేశారు. ఇప్పుడు పసిఫిక్ సముద్రంలో అది కూలిపోవడంతో అందరికి ఉపశమనం లభించింది.

English summary
CHINA'S Tiangong-1 space station plummeted to Earth in a fiery end overnight as it crashed into the Pacific Ocean, according to China’s Manned Space Engineering Office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X