వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్‌లోకి 24, 25, 26 తేదీల్లో వచ్చిన చైనా ఆర్మీ

భారత్ - చైనా సరిహద్దుల్లోని డొక్లామ్ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద చైనా తన యాక్టివిటీస్‌ను మరింత పెంచింది.

|
Google Oneindia TeluguNews

బీజింగ్/న్యూఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దుల్లోని డొక్లామ్ వద్ద ఉద్రిక్తతల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద చైనా తన యాక్టివిటీస్‌ను మరింత పెంచింది.

మరోవైపు, ఉత్తరాఖండ్‌లో చైనా ఆర్మీ వారం క్రితం కిలో మీటర్ మేర చొచ్చుకు వచ్చిన విషయం తెలిసిందే. చైనా జూలై 24, 25, 26 తేదీల్లో.. మొత్తం మూడు రోజులు చొచ్చుకు వచ్చిందని తెలుస్తోంది.

15 మందితో కూడిన చైనీస్ సైన్యం భారత్ వైపు సరిహద్దును దాటింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనా పర్యటనకు రెండు రోజుల ముందే ఈ చొరబాటు జరగడం గమనార్హం.

అరవై ఏళ్ల వివాదం

అరవై ఏళ్ల వివాదం

బారాహోతి ప్రాంతంపై భారత్-చైనా మధ్య దాదాపు అరవై ఏళ్లుగా వివాదం నెలకొని ఉంది. రెండు దేశాల మధ్య కాశ్మీర్‌లోని లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు దాదాపు 3,500 కి.మీల మేర సరిహద్దు ఉంది. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో మూడు చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేశారు.

బారాహోతి వద్ద చెక్ పోస్ట్

బారాహోతి వద్ద చెక్ పోస్ట్

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దాదాపు 350 కి.మీ మేర ఇండో-చైనా సరిహద్దు ఉంది. బారాహోతి వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. దీనిని మిడిల్ సెక్టార్ అంటారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఉన్న చెక్ పోస్ట్‌ను ఈస్ట్రన్ చెక్‌పోస్ట్ అని, లడఖ్‌లో ఉన్న చెక్‌పోస్ట్‌ను వెస్ట్రన్ చెక్‌పోస్ట్ అని పిలుస్తారు.

అప్పడు వివాదం.. ఆ తర్వాత భారత్ ఐటిబీపీ రక్షణ

అప్పడు వివాదం.. ఆ తర్వాత భారత్ ఐటిబీపీ రక్షణ

1958లో బారాహోతి ప్రాంతాన్ని తమ భూభాగంగా చైనా ప్రకటించడంతో రెండు దేశాల మధ్య వివాదం ప్రారంభమైంది. దీంతో ఇరువర్గాలు తమ బలగాలను మోహరించాయి. 1962 యుద్ధం తర్వాత ఈ చెక్ పోస్ట్‌లో భారత్ సాయుధులైన ఐటీబీపీ బలగాలతో రక్షణ కల్పించింది.

భారత్ మరో నిర్ణయంతో

భారత్ మరో నిర్ణయంతో

వివాదాన్ని సద్దుమణిచే చర్యల్లో భాగంగా చైనా సరిహద్దు వెంట ఉన్న మూడు చెక్ పోస్టుల్లో ఐటీబీపీ సిబ్బంది యూనిఫారం లేకుండా నిరాయుధులుగా కాపలా కాయాలని 2000లో భారత ప్రభుత్వం స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నది. దీంతో ఈ చెక్ పోస్ట్ వద్ద ఐటీబీపీ సిబ్బంది సివిల్ డ్రెస్‌లో కాపలా కాస్తుంటారు. దీనిని అలుసుగా తీసుకొని చైనా సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకొస్తుంటారు.

భారత్ భూభాగంలోకి కిలో మీటర్ మేర చొచ్చుకొచ్చిన చైనా ఆర్మీభారత్ భూభాగంలోకి కిలో మీటర్ మేర చొచ్చుకొచ్చిన చైనా ఆర్మీ

English summary
Fresh incursions by the Chinese were reported from the Chamoli area of Uttarakhand in the last week of July. In fact there were three incursions in three days reported in July.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X