• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆఫీస్ వేళ్లల్లో పోర్న్ వీడియోల వీక్షణం: చైనాదే అగ్రస్థానం

|

న్యూయార్క్: సైబర్ సెక్యూరిటీని పక్కన పెట్టి ఆఫీస్ వేళల్లో అశ్లీల, అభ్యంతరకరమైన చిత్రాలను, పోర్న్ వెబ్‌సైట్లను చూడటంలో చైనా దేశస్థులే ముందున్నారని తాజా సర్వేలో వెల్లడైంది. పని ప్రదేశాల్లో వ్యక్తిగత అవసరాలకు ప్రతి ఐదుగురిలో ఇద్దరు సోషల్ మీడియా వెబ్‌సైట్లను చూస్తారన్న విషయాన్ని సర్వేలో కనుగొన్నారు.

పనివేళల్లో పోర్న్ వెబ్‌సైట్లను చూడటంలో చైనీయులదే చెత్త రికార్డు అని తేల్చారు. మెక్సికో (10 శాతం), బ్రిటన్ (9 శాతం)తో పోల్చుకుంటే చైనా దేశస్థులు 19 శాతంతో అగ్రస్థానంలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది.

Chinese watch most porn at work: Survey

బ్లూకోట్స్ సిస్టం అనే సంస్థ 11 దేశాల్లో 1580 మందిపై సర్వే నిర్వహించింది. అశ్లీల వెబ్‌సైట్ల మాటున స్పైవేర్, ట్రోజాన్ హార్స్ లాంటి ప్రమాదకరమైన వైరస్ వల్ల తాము పనిచేసే కంపెనీలకు ముప్పు ఉంటుందనే విషయం తెలిసి కూడా వాటిని పట్టించుకోవడం లేదని తెలిపింది.

కార్యాలయ సమయాల్లో చైనీయులు పనులను పక్కనపెట్టి పోర్న్ వీడియోలను చూస్తున్నారన్న విషయాన్ని సర్వేలో గుర్తించారు. ఇలాంటి అలవాటు కార్పొరేట్ సంస్థలు, వ్యక్తిగత డాటా చౌర్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

English summary
When it comes to watching porn at work, the Chinese are way ahead of others.At 19 percent, China has the worst record for viewing adult content sites on a work device, with Mexico (10 percent) and the Britain (nine percent) not far behind, a global research study has revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X