వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్ : వైరస్‌కు కారణం గబ్బిలమని తెలిసినా.. ఈ యువతి ఆ సూప్‌ను తింటోంది

|
Google Oneindia TeluguNews

Recommended Video

వైరస్‌కు కారణం గబ్బిలమని తెలిసినా.. ఈ యువతి ఆ సూప్‌ను తింటోంది

చైనాతో పాటు ఇతర దేశాలను కూడా కరోనరీ వైరస్ వణికిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ బారిన పడి చాలా మంది మృతి చెందారు. కరోనరీ వైరస్‌కు కారణం కొన్ని జంతువులే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనరీ వైరస్ గబ్బిలాల నుంచి వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ ఓ మహిళ మాత్రం అవేమీ తనకు పట్టనట్టుగా ఆ గబ్బిలాలనే తింటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గబ్బిలం సూప్ తాగుతున్న యువతి

గబ్బిలం సూప్ తాగుతున్న యువతి

ఓ రెస్టారెంట్‌కు ఆకలి మీద వెళ్లిన మహిళ గబ్బిలం సూప్‌ను ఆర్డర్ ఇచ్చింది. ఆ సూప్‌ను తీసుకొచ్చి ఆమె ముందు ఉంచాడు వెయిటర్‌. ఇంకేముంది లొట్టలేసుకుంటూ గబ్బిలం సూప్‌ను తాగేసింది. అంతేకాదు గబ్బిలంను కూడా తింటూ ఉండగా ఎవరో వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే ఈ వీడియో వైరల్ అయ్యింది. గత నెలలో చైనాలోని వూహాన్ నగరంలో ఈ డెడ్లీ కరోనరీ వైరస్‌ను ముందుగా కనుగొన్నారు. ఇప్పటికే ఈ జబ్బు సోకి 25 మంది మృతి చెందారు. 800 మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

కరోనరీ వైరస్‌కు గబ్బిలం కూడా కారణమే

ముందుగా వైరస్‌ను గుర్తించిన వైద్యులు ప్రమాదకరమైనది కాదని చెప్పారు. కానీ అది కాస్త న్యుమోనియాకు దారితీస్తుండటంతో అప్రమత్తమయ్యారు. క్రమంగా ఈ వైరస్ సోకి మృతి చెందుతుండటంతో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే ఈ వైరస్ పాములు, మరియు గబ్బలాల నుంచి వ్యాప్తి చెందుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చైనాకు చెందిన ఓ యువతి గబ్బిలం తింటూ కెమెరా కంటికి చిక్కడం చర్చనీయాంశమైంది. గబ్బిలం యొక్క మాంసం తినాలి కానీ ఆ చర్మంను తినకూడదని ఓ వ్యక్తి చెప్పడం వీడియోలో వినిపిస్తుంది.

 10 రెట్లు ప్రమాదకరం అని చెప్పిన వైరాలజిస్టు

10 రెట్లు ప్రమాదకరం అని చెప్పిన వైరాలజిస్టు

2003లో తొలిసారిగా దీని మూలాలను కనుగొన్న ఓ చైనీస్ వైరాలజిస్టు కరోనరీ వైరస్ అనే ఈ అత్యంత ప్రమాదకరమైన వైరస్ 10 రెట్లు ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు. 17 ఏళ్ల క్రితం అంతంత మాత్రంగానే ఉన్న ఈ వైరస్ ఇప్పుడు ప్రమాదపు స్థాయిని మించిందని చెప్పారు. ఒక్కసారి సోకిందంటే మనిషి ప్రాణాలకు గ్యారెంటీ లేదని ఆ వైరాలజిస్ట్ హెచ్చరిస్తున్నారు. చైనాలో పలు జబ్బులు అయిన మలేరియా, దగ్గు, గొనోరియా వంటి వ్యాధుల చికిత్స కోసం తయారు చేసే మెడిసిన్స్‌లో గబ్బిలాలను వినియోగిస్తారు.

English summary
Footage purporting to show a Chinese woman eating a whole bat at a fancy restaurant has gone viral as the country is ravaged by a new deadly virus believed to have come from the flying mammals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X