వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు శిక్ష తప్పించుకునేందుకు 13సార్లు గర్భం దాల్చింది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనాలో ఓ మహిళ జైలు శిక్షను తప్పించుకోవడానికి 13 సార్లు గర్భం దాల్చింది. శిక్షను వర్తింపజేయమని కోర్టు ఆదేశాలు జారీ చేసిన ప్రతిసారీ తాను గర్భవతిననే కోర్టుకు తెలిపింది. 10 సంవత్సరాల్లో 14 సార్లు గర్భం దాల్చానని చెప్పగా, అందులో 13 సార్లు అది నిజమేనని కోర్టు కూడా నిర్ధారించింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చైనాలోని జిజాంగ్ ప్రావిన్స్‌లో జెంగ్ అనే మహిళ అవినీతికి పాల్పడిందనే కారణంతో 2005లో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ మహిళకు ఉరుంకి ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు అక్టోబర్ 17, 2005న జీవిత ఖైదు శిక్షగా విధించింది.

దీంతో ఆ సమయంలో ఆమె తాను గర్భవతిననే విషయం కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు తన ఆదేశాలను మరింతగా పొడిగించింది. ఆ తర్వాత ఆమెను జైలుకు పంపాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు మళ్లీ తాను గర్భవతిననే కోర్టుకు తెలిపింది.

Chinese woman got pregnant 13 times in 10 years to avoid jail term

ఇలా తాను 2006 నుంచి మొత్తం 14 సార్లు గర్భవతినని కోర్టుకు తెలిపింది. దీనిపై విచారణ చేపట్టగా 10 ఏళ్లలో 13 సార్లు గర్భం దాల్చిందని, ఒకసారి మాత్రం అది అబద్ధం చెప్పిందని తేలింది. ఇటీవలే ఆమెను కోర్టు ఆదేశాల ప్రకారం జైలుకు తరలించారు.

దీంతో శిక్ష పడిన పదేళ్ల తర్వాత ఆమె జైలు శిక్షను అనుభవిస్తుంది. ప్రస్తుతం జెంగ్ వయసు 39 ఏళ్లు. 10 ఏళ్లలో 14 సార్లు జెంగ్ ఎలా గర్భం దాల్చిందంటే, కోర్టు నుంచి తనకు అనుకూలంగా ఉత్తర్వులు రాగానే అబార్షన్ చేయించుకునేదంట.

English summary
A woman sentenced to life imprisonment for corruption in China’s Xinjiang Autonomous Region evaded prison for ten years by getting pregnant 13 times before she was finally sent to jail by a court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X