వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొలెస్ట్రాల్ డ్రగ్స్‌తో పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ: స్టడీ

|
Google Oneindia TeluguNews

రక్తంలో క్రొవ్వును కరిగించేందుకు స్టాటిన్స్ అనే డ్రగ్‌ను వినియోగిస్తారు. ఈ డ్రగ్ మెడిసిన్‌లో ఉండటం వల్ల పురుషుల్లో ప్రాణాంతక ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల ద్వారా వెల్లడించారు బెల్‌ఫాస్ట్‌కు చెందిన క్వీన్స్ యూనివర్శిటీ పరిశోధకులు. గుండె సంబంధిత వ్యాధులు కూడా ఈ స్టాటిన్స్ అనే డ్రగ్ తగ్గిస్తుందని అంతకుముందు పరిశోధనల్లో వెల్లడైనట్లు గుర్తుచేశారు. ఇక వివిధ రకాల క్యాన్సర్లు కూడా రాకుండా అడ్డుకుంటుందని చెప్పారు.

ప్రొస్టేట్ క్యాన్సర్‌పై స్టాటిన్స్ అనే ఈ డ్రగ్ ఎలా పనిచేస్తుందో అనేదానిపై ప్రత్యేక దృష్టి సారించారు పరిశోధకులు. అయితే స్టాటిన్స్ డ్రగ్ తీసుకుంటున్న పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 24శాతం తగ్గినట్లు తమ పరిశోధనల్లో తేలిందని క్వీన్స్ యూనివర్శిటీతో పాటు, ట్రినిటీ కాలేజ్ డబ్లిన్, హార్వర్డ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు తేల్చారు. అయితే ఈ మెడిసిన్‌ను తీసుకుంటున్న పురుషులను స్టడీ చేయగా వారికి ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు లేవని తేల్చింది.

Cholesterol drugs could reduce risk of lethal prostate cancer in men:Study

పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ అనేది చాలా మెల్లగా ప్రారంభమవుతుందని అది పురుషుడి జీవితకాలంపై ప్రభావం చూపదని చెప్పారు క్వీన్స్ యూనివర్శిటీకి చెందిన ఎమ్మా అలాట్. అయితే కొన్ని మాత్రం చాలా ప్రాణాంతకమైన క్యాన్సర్‌లని అవి చాలా త్వరగా మనిషి ప్రాణాలను తీసేస్తాయని ఆమె చెప్పారు. గత 24 ఏళ్లుగా పెద్ద సంఖ్యలో పురుషులను మానిటర్ చేసినట్లు పరిశోధకులు తెలిపారు.

స్టాటిన్ తీసుకుంటున్న పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రభావం ఏమేరకు ఉందనేదానిపై దృష్టి సారించారు. వారి కణజాలాన్ని పరీక్షించారు. వారి పరిశోధనలు తొలిదశలో ఉన్నప్పుడు స్టాటిన్ తీసుకున్న పురుషుల్లో వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం చూపిందన్నారు.

English summary
Statins, a type of drug used to lower blood cholesterol, could reduce the risk of a lethal form of prostate cancer in men, a study led by Queen’s University Belfast suggests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X