వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిన్ లాడెన్ ఆచూకి: సీఐఏ అధికారికి విషం పెట్టారు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అన్ని అవసరాలు తీరిన తరువాత సహాయం చేసిన వారిని సైలెంట్ గా అంతం చెయ్యడం పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐకి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి పని మరో సారి ఓ సీఐఏ అధికారి మీద విష ప్రయోగం చేసి అంతం చెయ్యడానికి విఫలయత్నం చేశారని వెలుగు చూసింది.

అంతర్జాతీయ ఉగ్రవాది బిన్ లాడెన్ ను తమ దేశంలో దాచిపెట్టి పైకి మాత్రం అతనిని కనిపెట్టడానికి పాకిస్థాన్ ప్రయత్నించిన విషం తెలిసిందే. అయితే బిన్ లాడెన్ పాకిస్థాన్ లోనే తలదాచుకున్నాడని కచ్చితమైన ఆధారాలు సేకరించిన సీఐఏ అధికారి మార్క్ కెల్టన్ పై ఐఎస్ఐ ఉగ్రవాదులు విష ప్రయోగం చేశారని వైద్యులు గుర్తించారు.

పాకిస్థాన్ లో సీఐఏ చీఫ్ గా పని చేసిన మార్క్ కెల్టన్ పై విష ప్రయోగం జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. 2011 మే 4వ తేదిన అమెరికా సీల్ దళాలు అబోటాబాద్ లోని బిన్ లాడెన్ ఇంటి మీద దాడి చేసి అతనిని అంతం చేశారు. బిన్ లాడెన్ ను అంతం చేసిన తరువాత రెండు నెలలకు మార్క్ తీవ్ర అనారోగ్యానికి గురైనారు.

CIA chief in Pakistan came home suspecting he was poisoned by ISI

విషయం తెలుసుకున్న అమెరికా ప్రభుత్వం మార్క్ ను పాకిస్థాన్ నుంచి వెనక్కి పిలిపించింది. మార్క్ దాదాపు బతకడని వైద్యులు చెప్పారు. అయితే మార్క్ అనారోగ్యానికి కారణం ఏమిటి అని వైద్యులు మొదట చెప్పలేక పోయారు. చివరికి అతని పొత్తికడుపు ప్రాంతంలో ఆపరేషన్ చేసి బతికించారు.

మార్క్ మీద విష ప్రయోగం జరిగిందని వైద్యులు చెప్పారు. గుడాచార సంస్థలో పని చేసే వారి మీద ఇలాంటి ప్రయోగాలు చేస్తారని మార్క్ అంటున్నారు. అయితే బిన్ లాడెన్ ను అంతం చెయ్యడానికి కీలకమైన వ్యక్తిగా పని చేసినందుకు చాల గర్వంగా ఉందని మార్క్ చెబుతున్నారు.

English summary
In reality, the CIA station chief was so violently ill that he was often doubled over in pain, current and former U.S.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X