• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దశాబ్దాలకాలం పాటుగా అమెరికా ఉత్తర కొరియా మధ్య రహస్య చర్చలు

|

ఓ వైపు అగ్రరాజ్యం అమెరికా... మరోవైపు ఆ దేశాన్నే గడగడలాడించిన ఉత్తర కొరియా. రెండు దేశాల అధినేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి వెళ్లారు. అణ్యాయుధాల తయారీ ఆపివేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరడం... ఆపే ప్రసక్తే లేదంటూ ప్రయోగాల మీద ప్రయోగాలు కిమ్ చేయడం పరిపాటి అయ్యింది. ఇద్దరి మధ్య ఏకంగా యుద్ధ వాతావరణమే నెలకొంది. కానీ చివరకు ఇద్దరు నేతలు సింగపూర్ వేదికగా శాంతి చర్చలు జరిపారు. ఇరు దేశాలు అంత ఆగ్రహంతో ఒకరిపైకి ఒకరు కత్తులు దూసుకుని ఆ తర్వాత శాంతి చర్చలకు వచ్చారంటే దీని వెనక మరో కథ ఉంది.

 ట్రంప్ కిమ్ భేటీ వెనక ఇంటెలిజెన్స్ కృషి

ట్రంప్ కిమ్ భేటీ వెనక ఇంటెలిజెన్స్ కృషి

అగ్రరాజ్యం అమెరికా ఉత్తర కొరియా దేశాల మధ్య నిశబ్ధ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ప్రజల సంగతి పక్కనబెడితే ఇటు ట్రంప్ అటు కిమ్ జాంగ్ ఉన్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. అయితే దీనికి చెక్ పెట్టాలని ఇరు దేశాధినేతలు భావించడంతో గతేడాది జూన్‌లో ట్రంప్ కిమ్ భేటీ అయ్యారు. ఈ భేటీ వెనక పెద్ద కసరత్తే జరిగింది. గత పదేళ్లుగా అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, ఉత్తర కొరియా ఇంటెలిజెన్స్ అధికారులు ఒకరికొకరితో చర్చలు జరిపినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య రహస్య చర్చలు జరిగినట్లు ఓ అంతర్జాతీయ వార్తా పత్రిక కథనం ప్రచురించింది. ఒబామా హయాంలో రెండు సార్లు చర్చలు జరిపినట్లు అంతకుముందు కూడా రహస్య సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం.

ఒబామా హయాంలో చివరిసారిగా చర్చలు

ఒబామా హయాంలో చివరిసారిగా చర్చలు

ఒబామా హయాంలో చర్చలు తర్వాత ఇరు దేశాల ఇంటెలిజెన్స్ అధికారులు ఇక చర్చలకు ఫుల్‌స్టాప్ పెట్టారు. అనంతరం ట్రంప్ హయాంలో కీలక వ్యక్తిగా వ్యవహరించిన మైక్ పొంపే చర్చలను తిరిగి ప్రారంభించారు. ఓ ఇంటెలిజెన్స్ అధికారిని ఉత్తరకొరియాకు పంపి చర్చలు జరపాల్సిందిగా కోరారు. దీంతో ఆ అధికారి 2017 ఆగష్టులో ఉత్తరకొరియాకు వెళ్లి చర్చలు జరిపినట్లు కథనంలో ఉంది. ఇక 2018లో రహస్య చర్చలు, బహిరంగ చర్చలు ఊపందుకోవడంతో ఎట్టకేలకు ట్రంప్ కిమ్ జాంగ్ ఉన్‌లు గతేడాది జూన్‌లో సింగపూర్‌లో భేటీ అయ్యారు.

 ఫిబ్రవరిలో ట్రంప్ కిమ్‌ల మధ్య భేటీ...?

ఫిబ్రవరిలో ట్రంప్ కిమ్‌ల మధ్య భేటీ...?

ఇదిలా ఉంటే మరోసారి ట్రంప్ కిమ్ సమావేశం అయ్యేందుకు చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చేనెల ఫిబ్రవరిలో ఈ ట్రంప్ కిమ్‌లు భేటీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీని వెనక కూడా ఈ సీక్రెట్ ఏజెంట్లే పనిచేస్తున్నట్లు సమాచారం. ట్రంప్ కిమ్ సమావేశం ఏర్పాటు చేయడంలో ఇరుదేశాల అధికారులు చాలా రిస్క్‌కూడా చేసినట్లు అంతర్జాతీయ పత్రిక వెల్లడించింది. అమెరికా ఉత్తరకొరియాలు ఒక్కటి అవ్వక ముందు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాధినేతల మద్య విబేధాలు తొలిగిపోయేందుకు కృషి చేసి సక్సెస్ అయ్యారు. రహస్య ఒప్పందాలు గత పదేళ్లుగా రెండు దేశాల మధ్య జరుగుతున్నాయా అన్న ప్రశ్నకు వైట్ హౌజ్ వర్గాలు సమాధానం దాటవేశాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With presidential approval, the United States Central Intelligence Agency has maintained a secret channel of communication with North Korea since at least 2009, according to The Wall Street Journal. Many were surprised in 2018, when the then CIA director Mike Pompeo made a sudden visit to Pyongyang to speak with senior North Korean officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more