వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్‌కు కాదన్నా.. : అక్కడ భార్యలను కొట్టొచ్చట!

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్ : మత విశ్వాసాలు, సాంప్రదాయాలు మనుషుల్లో సమదృష్టిని పెంపొందించాలే గానీ, అవే మతాలను అడ్డుపట్టుకుని తోటి మనుషుల పట్ల వివక్షపూరితంగా వ్యవహరించడం అమానవీయం. తాజాగా పాకిస్తాన్ పోకడలను చూస్తోంటే ఇవే మాటలు నిజమనిపించకమానదు. భార్యలను యథేచ్చగా కొట్టేందుకు అక్కడ ఏకంగా పార్లమెంటు చట్టాలనే రూపొందిస్తున్నారు.

మహిళా హక్కులని కాలరాస్తున్నారని అక్కడి మహిళలు ఎంతగా అరిచినా.. అవన్నీ అరణ్య రోదనే అవుతున్నాయి. మహిళా వ్యతిరేకతను లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుపోతున్నాయి పాకిస్తాన్ వర్గాలు. భార్యలను వేధించే చట్టాలను రూపొందించడానికి కంకణం కట్టుకున్న అక్కడి మత గురువులు, మేథావులు ఏకంగా 163 పేజీల పార్లమెంట్ చట్టానికి రూపకల్పన చేస్తున్నారు.

cii proposes husbands to be allowed to lightly beat defying wives

ఆ చట్టాల ప్రకారం.. "ఏ భర్త అయినా సరే భార్యను యథేచ్చగా వేధించవచ్చు. భర్త కొట్టినా, తిట్టినా మౌనంగా భరించాలే తప్ప తప్పించుకునే ప్రయత్నం చేయరాదు. ఒకవేళ తప్పించుకునే ప్రయత్నం చేస్తే సదరు భార్యకు ఇక విడాకులే. ఎప్పుడూ భర్తకు నచ్చే దుస్తులనే భార్యలు ధరించాలి. ఒకవేళ శృంగారంలో పాల్గొనడానికి భార్య సుముఖంగా లేకపోయినా, శృంగారం తర్వాత మరియు పీరియడ్స్ సమయంలో స్నానం చేయకపోయినా..ఆమెను కొట్టే హక్కు భర్తకు ఉంటుంది".

ఇలా రూపొందించిన ఈ చట్టాలను ఖచ్చితంగా అందరూ పాటించాల్సిందేనంటున్నారు అక్కడి మతపెద్దలు.భార్యలను వేధించడానికి ఇలాంటి నిబంధనలతో 163 పేజీల ముసాయిదాను కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ (సీఐఐ) నేతృత్వంలోని 20 మంది పాకిస్తాన్ బృందం రూపొందిస్తోంది. ఖురాన్, షరియత్ చట్టలాను అనుసరించే తమ కొత్త నిబంధనలు ఉంటాయని సదరు మతపెద్దలు వివరణ ఇచ్చుకోవడం గమనార్హం.

English summary
ISLAMABAD: The Council of Islamic Ideology (CII) has proposed its own women protection bill, recommending ‘a light beating’ for the wife if she defies the husband.The 20-member CII is a constitutional body which gives recommendations to parliament regarding Islamic laws. However, parliament is not bound to consider its recommendations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X