వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం ఛాయలు - సింధ్‌ పోలీస్‌ బాస్‌ను కిడ్నాప్‌ చేసిన ఆర్మీ - సైన్యం విచారణ

|
Google Oneindia TeluguNews

పాకిస్తాన్‌లో మరోసారి అంతర్యుద్ధం తప్పదా ? విపక్షాలు సైన్యం మద్దతున్న ఇమ్రాన్‌ ఖాన్ సర్కారుపై చేస్తున్న పోరాటం ఏ మలుపు తీసుకోబోతోంది ? దేశం మరోసారి సైన్యం చేతుల్లోకి వెళ్లబోతోందా ? సింధ్‌ పోలీస్‌ బాస్‌ను సైనిక బలగాలు కిడ్నాప్‌ చేయడం వెనుక కారణమేంటి ? ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అల్లుడిని అరెస్టు చేయాలని సింధ్‌ పోలీస్‌ బాస్‌పై ఆర్మీ ఎందుకు ఒత్తిడి తెస్తోంది ? ఇప్పుడు పాకిస్తాన్‌లో సాధారణ ప్రజల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్నలివి. రెండేళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఇమ్రాన్‌ ఖాన్‌.. ఆర్మీ ఒత్తిడితో ప్రత్యర్ధి పార్టీలను లక్ష్యంగా చేసుకుంటున్నారన్న ఆరోపణల మధ్య విపక్షాలన్నీ ఏకమయ్యాయి. దీంతో ఇప్పుడు పాకిస్తాన్‌లో ఆర్మీ మద్దతున్న ఇమ్రాన్‌ ఖాన్‌ వర్సెస్‌ విపక్షాల పోరు ముదురుతోంది.

పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం ఛాయలు..

పాకిస్తాన్‌లో అంతర్యుద్ధం ఛాయలు..

పాకిస్తాన్‌లో నిత్యం రాజకీయ నేతలు వర్సెస్‌ ఆర్మీగా సాగే ఆధిపత్య పోరులో ఈసారి రాజకీయాలు మరో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. ఆర్మీ మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌ ఖాన్‌ సర్కారు తమను అడుగడుగునా అడ్డుకోవడాన్న నిరసిస్తూ తాజాగా విపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. అవినీతి ఆరోపణలతో దేశం వదిలి పారిపోయి ప్రవాసంలో ఉంటున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఈ కూటమికి నేతృత్వం వహిస్తున్నారు. అక్కడి నుంచే ఆయన వీడియో కాల్స్‌ ద్వారా మాట్లాడుతూ విపక్షాలను ఇమ్రాన్‌ ఖాన్‌పై పోరుకు సన్నద్దం చేస్తున్నారు. తాజాగా విపక్ష కూటమి దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు దేశాన్ని మరోసారి అంతర్యుద్ధంలోకి నెట్టే పరిస్ధితి కనిపిస్తోంది.

సింధ్‌ పోలీస్‌ బాస్‌ను కిడ్నాప్‌ చేసిన ఆర్మీ...

సింధ్‌ పోలీస్‌ బాస్‌ను కిడ్నాప్‌ చేసిన ఆర్మీ...


ప్రవాసంలో ఉంటూ దేశంలో విపక్ష పార్టీలను ఆర్మీ-ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వంపై ఎగదోస్తున్న మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ వచ్చే ఏడాది నాటికి స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్నారు. ఆ లోపు తన పార్టీ తరఫున అల్లుడు మొహమ్మద్‌ సఫ్దర్‌ను రంగంలోకి దింపారు. ఆయన ఇప్పుడు విపక్ష కూటమి చేపడుతున్న నిరసనల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో సఫ్దర్‌ను అరెస్టు చేయాలని సింధ్‌ పోలీసులపై ఆర్మీ ఒత్తిడి పెంచుతోంది. ఇందుకు అంగీకరించని సింధ్‌ పోలీస్‌ బాస్‌ ముస్తాక్‌ మెహర్‌ను సైనిక బలగాలు కిడ్నాప్‌ చేశాయి. దీంతో ఆయనకు మద్దతుగా దేశంలో పోలీసులు ఏకమయ్యారు.

 ఆర్మీకి పోలీసుల సహాయనిరాకరణ..

ఆర్మీకి పోలీసుల సహాయనిరాకరణ..

కోర్టు బెయిల్‌పై విడుదలైన నవాజ్ షరీఫ్‌ అల్లుడు కెప్టెన్‌ సఫ్దర్‌ను ఆర్మీ అదుపులోకి తీసుకోవడంతో పాటు అరెస్టు చేయాలని సింధ్‌ పోలీసు బాస్‌ ముస్తాక్‌పై ఒత్తిడి పెంచడం, అది కుదరక ఆయన్ను కిడ్నాప్‌ చేయడం వంటి పరిణామాలు పోలీసుల్ల ఆగ్రహం పెంచాయి. దీంతో కరాచీలో పోలీసులు వర్సెస్‌ ఆర్మీగా పోరు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పోరులో ఆర్మీ పది మంది పోలీసులను కాల్చి చంపినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ ముందుగా స్పందించలేదు. కానీ ప్రవాసంలో ఉన్న నవాజ్‌ షరీఫ్‌ దీనిపై అక్కడి నుంచే మీడియాకు బయటపెట్టడంతో చేసేది లేక ఈ పరిణామాలపై ఆర్మీ ఛీఫ్‌ ఖమర్‌ బజ్వా విచారణకు ఆదేశించారు. ఈ పరిణామాలు సహజంగానే దేశంలో మరో అంతర్యుద్దం జరగబోతోందా అన్న అనుమానాలు పెంచుతున్నాయి. అయితే సింధ్, కరాచీ ఘటనలపై ఆర్మీ విచారణకు ఆదేశించడాన్ని సింధ్‌ పోలీస్ ఛీఫ్‌ ముస్తాక్‌ స్వాగతించారు.

English summary
Pakistan's army chief has ordered an investigation into allegations that Sindh police chief was kidnapped by army troops to force him to order the arrest of the son-in-law of exiled former prime minister Nawaz Sharif.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X