వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంచుకొస్తున్న ముప్పు: 'వేడెక్కుతోన్న ధృవాలు', పరిశోధకుల్లో ఆందోళన..

982జనవరిలో 15డిగ్రీల ఉష్ణోగ్రత కావడమే ఇప్పటిదాకా అత్యధిక రికార్డుగా కొనసాగుతూ వస్తోంది. తాజాగా ఉష్ణోగ్రతలు 17.5కు చేరడంతో పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

|
Google Oneindia TeluguNews

అంటార్కిటిక్: ప్రకృతి విపత్తులు ముంచుకొస్తే ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదరువుతాయో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలు ఇప్పుడు మానవుడిని కలవరపెడుతున్నాయి.

ముఖ్యంగా ధృవ ప్రాంతాల్లోని వాతావరణం క్రమ క్రమంగా విపరీత ఉష్ణోగ్రతలకు లోనవుతుండటం.. భవిష్యత్తులో ఏవిధమైన దుష్ఫలితాలకు దారితీస్తుందోనన్న ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఉత్తర అంటార్కిటిక్ ద్వీపకల్పంలోని అర్జెంటీనా రీసర్చ్ సెంటర్ 'ఎస్పరాంజా' బేస్ వద్ద రికార్డు స్థాయిలో 17.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా ప్రపంచ వాతావరణ సంస్థ నిపుణులు వెల్లడించారు.

Climate change in antarctic creating tension

1982జనవరిలో 15డిగ్రీల ఉష్ణోగ్రత కావడమే ఇప్పటిదాకా అత్యధిక రికార్డుగా కొనసాగుతూ వస్తోంది. తాజాగా ఉష్ణోగ్రతలు 17.5కు చేరడంతో పాత రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ధ్రువాల వద్ద ఇంతలా ఉష్ణోగ్రతలు ఎందుకు పెరుగుతున్నాయో అంతుచిక్కక పరిశోధకులు కలవరపడుతున్నారు.

ధ్రువా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల మంచు కరిగే ప్రమాదముందని, దాంతో పలుదేశాల్లోని లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
The climate changes in Antarctic are creating tension across the world. Temperatures are highly increasing day by day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X