వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అడుగు దూరంలో హిల్లరీ, ట్రంప్‌కు ఏ రాష్ట్రాలు అనుకూలం: అలా జరిగితే తప్ప..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ కనిపిస్తోంది. అయినప్పటికీ హిల్లరీ గెలుపు ఖాయమని చెబుతున్నారు. ప్రపంచ దేశాల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ కనిపిస్తోంది.

ప్రజలు ఓట్లు వేసి గెలిపించే అమెరికా ఎలక్ట్రోరల్ కాలేజీ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఎలక్ట్రోరల్ కాలేజీలో మొత్తం 538 ఓట్లు ఉండగా మెజార్టీ 270 ఓట్లు సాధించిన అభ్యర్థి అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు.

ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ సేకరించిన వివరాల ప్రకారం హిల్లరీ ఖాతాలో 268 ఓట్లు ఉన్నాయి. 17 రాష్ట్రాలలో స్పష్టమైన ఆధిక్యాన్ని, మరో 5 రాష్ట్రాలలో అనుకూలతను సంపాదించిన ఆమె.. ఊహించని పరిణామాలు జరిగితే తప్ప హిల్లరీ గెలుపు ఖాయమని చెబుతున్నారు.

సోమవారం రాత్రి నాటికి ట్రంప్‌కు 204 ఎలక్ట్రోరల్ ఓట్లు పడటం ఖాయంగా తేలింది. ఆ మేరకు 20 రాష్ట్రాలలో గట్టి పట్టును సాధించిన ట్రంప్ మరో 5 రాష్ట్రాలలో అనుకూలతను సాధించింది. నేటి ఓట్లలో అన్నింటిలోను నెగ్గితే తప్ప ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని గెలవలేడు.

ఆరు రాష్ట్రాలు కీలకం

చాలా రాష్ట్రాల ఓటర్లు ఇప్పటికే రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీలలో ఏదో ఒకదానికి మొగ్గు చూపారు. ఆరు రాష్ట్రాలలో మాత్రం హోరాహోరీ ఉంది. 18 ఓట్లున్న ఓహియో, 11 ఎలక్ట్రోరల్ ఓట్లున్న ఆరిజోనా, 29 ఓట్లున్న ఫ్లోరియా, ఆరు ఓట్లున్న నెవెడా, ఒక్క ఎలక్ట్రోరల్ ఓట్లున్న నెబ్రాస్కా రెండో సభ, 15 ఓట్లున్న నార్త్ కరోలినాలే అమెరికా అధ్యక్షుడిని నిర్ణయించడంలో కీలకం కానున్నాయి.

Trump

సమీకరణాలు తారుమారు!

ఎప్పటికప్పుడు సమీకరణాలు మారుతుంటాయి. ఒహియో 18 ఓట్లు, ఉటా 6 ఓట్లు రిపబ్లికన్లకు అనుకూలంగా మారిందని సమాచారం. న్యూహ్యాంపర్ షైర్‌లో ట్రంప్ ఆధిక్యంలో కనిపించారు.

రిపబ్లికన్ (ఎలక్ట్రోరల్) రాష్ట్రాలు..

అలబామా (9), అలస్కా (3), ఆర్కానా (6), ఇడాహో (4), ఇండియానా (11), కన్సాస్ (6), కెంటకీ (8), లూసియానా (8), మిసిసిప్పీ (6), మిస్సోరి (10), మోంటానా (3), నెబ్రాస్కా (4), నార్త్ డకోటా (3), ఒక్లహామా (7), సౌత్ కరోలినా (9), సౌత్ డకోటా (3), టెన్నెస్సీ (11), టెక్సాస్ (38), వెస్ట్ వర్జీనియా (5), వ్యోమింగ్ (3),.. మొత్తం 157 ఎలక్ట్రోరల్ ఓట్లు.

రిపబ్లికన్ పార్టీ, ట్రంప్‌కు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలు..

జార్జియా (16), అయోవా (6), మైనే రెండో ప్రతినిధి సభ (1) స్థానాల్లో మొదటి నుంచి ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత ఒహియో 11, ఉటా ఆరు ఓట్లు, కూడా రిపబ్లికన్లకు అనుకూలంగా మారాయి. దీంతో మొత్తం ఓట్లు 204 అయ్యాయి.

డెమోక్రటిక్ (ఎలక్ట్రోరల్) అనుకూల రాష్ట్రాలు..

కాలిఫోర్నియా 55, కనెక్టికట్ 7, డెలావెర్ 3, డీసీ 3, హవాయి 4, ఇల్లినాయిస్ 20, మైనే 3, మేరీలాండ్ 10, మసాచ్చుసెట్స్ 11, న్యూజెర్సీ 14, న్యూయార్క్ 29, ఆరేగాన్ 7, రోడ్ ఐలాండ్ 4, వెర్మోంట్ 3, వాషింగ్టన్ 12, మిన్నెసొట్టా 10,. న్యూమెక్సికో 5.

డెమోక్రటిక్ పార్టీకి మొగ్గు చూపుతున్న రాష్ట్రాలు..

కొలరాడో 9, మిచిగాన్ 16, పెన్సిల్వేనియా 20, వర్జీనియా 13, విస్కోనిసిన్ 10 రాష్ట్రాలు హిల్లరీకి అనుకూలంగా ఉన్నాయి. ఆమెకు మొత్తం 268 ఓట్లు ఉన్నాయి. కాగా, బలాబలాలు ఓటర్లు ఓటు వేసే సమయానికి తారుమారు కూడా కావొచ్చు.

English summary
Clinton Has Solid Lead in Electoral College; Trump's Winning Map Is Unclear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X