వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ బస్ ఏ320 ప్రమాదంలో కొత్త ట్విస్ట్: కో పైలట్ కుట్రనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

ప్యారిస్: ఆల్ఫ్స్ పర్వతాల్లో కుప్పకూలిన జర్మన్ వింగ్స్ విమానం కో పైలట్ కావాలానే దానిని ప్రమాదానికి గురి చేశాడా? అంటే కావొచ్చునని అధికారులు చెబుతున్నారు. కాక్ పిట్ నుండి పైలట్ బయటకు వెళ్లాక కోపైలట్ ఆండ్రి యాజ్ ల్యూబిడ్జ్ (28) పూర్తిగా విమాన బాధ్యతలు తీసుకున్నాడని, ఫ్రెంచి ప్రాసిక్యూషన్ బ్రైస్ రాబిన్ చెప్పారు. పైలట్‌ను లోనికి రానీయకుండా అతడు లోపలు నుండి గడియ వేసుకున్నాడని, పైలట్ తలుపు తట్టినా తెరవలేదని చెప్పారు.

జర్మన్ వింగ్స్ ఎయిర్ బస్సు విమానం కూలిపోవడానికి ముందు శరవేగంగా కిందికి జారిపోవడానికి, ఆ తర్వాత కూలిపోవడానికి విమానం కో పైలట్ కారణమని ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తుండడంతో ఈ విమానం ప్రమాదం మిస్టరీ కొత్త మలుపు తిరిగేట్లుగా కనిపిస్తోంది.

అధికారుల చెప్పిన వివరాల ప్రకారం జర్మన్‌వింగ్స్ విమానం కో పైలట్ విమానాన్ని పూర్తిగా తన కంట్రోల్‌లోకి తీసుకుని, ఉద్దేశపూర్వకంగా విమానాన్ని కిందికి దించడం ప్రారంభించాడని బీబీసీ వెల్లడించింది. కో పైలట్ విమానాన్ని నాశనం చేయాలనుకున్నట్లుగా కనిపిస్తోందని ఎఎఫ్‌పి వార్తాసంస్థ పేర్కొంది.

విమానం కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ నుంచి కీలక సమాచారాన్ని వెలికి తీసిన తర్వాత ఫ్రెంచ్ ప్రాసిక్యూటర్లు కోపైలట్ పాత్రపై ఈ నిర్ధారణకు వచ్చారు. విమానం కాక్‌పిట్ లాక్ చేసి ఉండడంతో ప్రధాన పైలట్ కాక్‌పిట్‌లోకి ప్రవేశించలేకపోయినట్లు వెలికి తీసిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌నుంచి బైట పడిన ఈ సమాచారాన్ని బట్టి చూస్తే 150 మంది ప్రయాణికుల మృతికి కారణమై విమానం కూలిపోవడం వెనుక కుట్ర ఉండి ఉండవచ్చనిపిస్తోంది.

కాక్‌పిట్‌ నుంచి బైటికి వెళ్లిన ఒక పైలట్ తిరిగి లోపలికి రాలేక పోయాడని, విమానం కూలిపోయే దాకా కూడా లాక్ చేసిన తలుపుపై అతను పదేపదే తట్టినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదని రెండు బ్లాక్‌బాక్స్‌లలో ఒకటైన కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లోని సమాచారాన్ని బట్టి తెలుస్తోందని దర్యాప్తు అధికారులు తెలియజేసినట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది.

Co-pilot suspected of deliberately crashing Germanwings jet

బైట ఉన్న వ్యక్తి మొదట నెమ్మదిగా తలుపు తట్టినా సమాధానం రాలేదు.. ఆ తర్వాత అతను డోర్‌ను బలంగా బాదాడు.. అయినా సమాధానం రాలేదు... అసలు సమాధానమే లేదు అని సీవీఆర్ నుంచి తీసిన సమాచారాన్ని ఉటంకిస్తూ ఓ దర్యాప్తు అధికారి చెప్పారు. ఆ వ్యక్తి తలుపులు బద్దలు కొట్టడానికి ప్రయత్నించడం కూడా వినవచ్చని ఆ దర్యాప్తు అధికారి చెప్పాడు.

వీసీఆర్‌లోని రికార్డింగ్స్‌ను బట్టి ఇద్దరు పైలట్ల మధ్య సంభాషణ చాలా ప్రశాంతంగా ఎలాంటి ఆవేశ కావేషాలు లేకుండా ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. కానీ ప్రమాదం జరిగే సమయంలో కో పైలట్ ఒక్కడే కాక్‌పిట్‌లో ఉన్నాడని, దాని తలుపు తెరుచుకోలేదనేది స్పష్టమవుతోందని ఆ అధికారి చెప్పారు. అంతేకాదు దాదాపు ఎనిమిది నిమిషాల పాటు విమానం కిందికి జారిపోయి ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వత ప్రాంతంలో కూలిపోయిన సమయంలో వాతావరణం కూడా బాగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే విమానం కూలిపోవడానికి దాని వయసు ఎంతమాత్రం కారణం కాదని కూడా నిపుణులు అంటున్నారు.

1991లో ఈ విమానాన్ని లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు అందజేయగా, అప్పటినుంచి 24 ఏళ్ల పాటు సేవలుందిస్తూ ఉంది. మరోవైపు విమానం పైలట్‌కు తగినంత అనుభవం లేకపోవడం ప్రమాదానికి కారణమని అనుకోవడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే పైలట్‌కు 6 వేల గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉందని జర్మన్ వింగ్స్ సంస్థ సీఈఓ వింకిల్‌మ్యాన్ ఇంతకు ముందే చెప్పారు.

2013నుంచి ఉద్యోగం చేస్తున్న కో పైలట్‌కు ఇప్పటివరకు కేవలం 630 గంటలు మాత్రమే విమానం నడిపిన అనుభవం ఉందని జర్మన్ వింగ్స్ మాతృసంస్థ అయిన లుఫ్తాన్సా ఎఎఫ్‌పి వార్తాసంస్థకు తెలిపింది. ఇద్దరు అనుభవజ్ఞులైన పైలట్లు నడుపుతున్న, సాంకేతికంగా ఎలాంటి చిన్నపాటి లోపమూ లేని విమానం ఒక్కసారిగా అంత ఎత్తునుంచి కిందికి ఎందుకు జారిపోయిందో తమకు అర్థం కావడం లేదని లుఫ్తాన్సా పేర్కొంది.

English summary
Co-pilot suspected of deliberately crashing Germanwings jet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X