• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వామ్మో యమ డేంజర్: కొబ్బరి నూనె విషమట..బాంబు పేల్చిన హార్వర్డ్ ప్రొఫెసర్

|

కొబ్బరి నూనె... తెలుగు రాష్ట్రాల్లో దీన్ని తలకు రాసుకుంటారు... కేరళలో మాత్రం వంటనూనెలా వాడుతారు. కొందరు కొబ్బెర నూనె తాగితే పలు వ్యాధులు నయమవుతాయని చెబుతుంటారు. కొబ్బెర నూనెతో ఎన్నో లాభాలు ఉంటాయని చాలామంది చెప్పడం విన్నాము. ఇక యూట్యూబ్‌లో కోకోనట్ అని టైప్ చేస్తే చాలు... దానికి సంబంధించినవి బోలెడు వీడియోలు వస్తాయి. కొబ్బరి నూనె తాగడం వల్ల ఏకంగా బరువే తగ్గుతారని వీరమాచినేని అనే పెద్దాయన సెలవిచ్చారు. దీంతో ఆయన ప్రతిపాదించిన హెల్త్ డైట్‌కు బీభత్సమైన ఫ్యాన్స్ తయారయ్యారు. ఇప్పుడు కొబ్బరి నూనె గురించి కఠోరమైన వాస్తవాన్ని బయటపెట్టి అదంటేనే విరక్తి కలిగేలా చేశారు అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ కరీన్ మిషెల్స్.

హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కెరిన్ మిషెల్స్ కొబ్బరి నూనె స్వచ్ఛమైన విషమంటూ చెప్పి బాంబు పేల్చారు. కొబ్బరి నూనె అనేది వంటల్లో వినియోగిస్తే కోరి కోరి అనారోగ్యం తెచ్చుకున్నట్లేనని చెప్పారు.కొబ్బరి నూనె శుద్ధి చేసిన విషం అని ఆమె తెలిపారు.కొందరు కొబ్బరి నూనె నేరుగా తాగుతుంటారని అయితే అత్యంత ప్రమాదకరమని కెరిన్ స్పష్టం చేశారు. కోకనట్ ఆయిల్ అండ్ అదర్ న్యూట్రిషనల్ ఎర్రర్స్ పై కెరిన్ లెక్చర్ ఇచ్చారు. ప్రస్తుతం కెరిన్ ఇచ్చిన లెక్చర్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే కొన్ని మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు.

Coconut oil..a pure poison says Harvard Proffesor

కొబ్బరి నూనెలో ఎక్కువ శాతం కొవ్వు పదార్థాలుంటాయని చెప్పిన కెరిన్... శరీరంలోని ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను ఈ కొబ్బరి నూనె పెంచుతుందని తద్వారా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని చెప్పారు. కొబ్బరినూనెలో 80శాతం కొవ్వు ఉంటుందని..ఇది పంది మాంసంలోని కొవ్వు కంటే రెండింతలుండగా... బీఫ్‌లో ఉండే కొవ్వుకంటే 60శాతం అధికంగా ఉంటుందని వివరించారు. గతేడాది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అనే సంస్థ వంటల్లో కొబ్బరి నూనె వినియోగంపై సర్వే చేసింది. ఇందులో పావువంతు అమెరికన్లు కొబ్బరి నూనె ఆరోగ్యకరమైనదే అని చెప్పగా... ఈ స్టేట్‌మెంట్‌తో 37శాతం మంది న్యూట్రిషన్లే ఏకీభవించారు.

వంటల్లో కొబ్బరినూనె వినియోగం ఎంత తక్కువగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిదని పలు ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కొబ్బరి నూనె తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి శాస్త్రీయపరమైన రుజువు లేదని బ్రిటీష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ చెప్పుకొచ్చింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Karin Michels, an epidemiologist at the Harvard TH Chan school of public health, poured scorn on the superfood movement and singled out the fad for coconut oil in particular, calling the substance “one of the worst things you can eat” that was as good for wellbeing as “pure poison”. The speech, delivered in German, has now been watched nearly a million times on YouTube.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more