• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా తొలి నల్లజాతి విదేశాంగ శాఖ మంత్రి కోలిన్ పావెల్ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. తొలి నల్లజాతి అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కోలిన్ పావెల్(84) కన్నుమూశారు. కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో పావెల్ మరణించినట్లు ఆయన కుటుంబం సోమవారం ప్రకటించింది. అద్భుతమైన, ప్రేమగల భర్త, తండ్రి, తాతను, గొప్ప అమెరికన్‌ను కోల్పోయామంటూ పావెల్‌ కుటుంబం ఒక ప్రకటనలో పేర్కొంది.

పావెల్‌ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నారని కూడా తెలిపింది. కరోనాతోపాటు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారని తెలిపింది. పావెల్ మరణంపై స్పందించిన అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ 'ఒక కుటుంబ సభ్యుడిని, మంచి స్నేహితుడిని కోల్పోయాను' అని వ్యాఖ్యానించారు.

Colin Powell, first Black US secretary of state, dies of Covid-19 complications

కాగా, రిపబ్లికన్ రాజకీయవేత్త అయిన కోలిన్ పావెల్‌ టాప్ మిలిటరీ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. పావెల్‌.. రిటైర్డ్ ఫోర్-స్టార్ జనరల్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ మాజీ చైర్మన్. 2001-2005 మధ్య జార్జ్ డబ్ల్యూ బుష్ ఆధ్వర్యంలోని రిపబ్లికన్ పార్టీ ప్రభుత్వంలో పావెల్ విదేశాంగ మంత్రిగా పని చేశారు. విదేశాంగ మంత్రి బాధ్యతలు చేపట్టిన తొలి ఆఫ్రికన్-అమెరికన్‌గా ఆయనే కావడం గమనార్హం.

సెప్టెంబరు 11 ఉగ్ర దాడుల తరువాత గందరగోళ పరిస్థితుల నిర్వహణలో పావెల్ కీలక భూమికను నిర్వహించారు. అప్పట్లో తనను తాను మోడరేట్ రిపబ్లికన్‌గా చెప్పుకున్న కోలిన్ పావెల్.. 2008లో ఒబామాను అధ్యక్షుడిని చేయాలని కోరుతూ తన పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారు. అయితే ఇరాక్‌ యుద్ధం సందర్భంగా పావెల్‌ తీవ్ర విమర్శలపాలయ్యారు. ఇరాక్‌లో సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నట్లు ఆరోపిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఫిబ్రవరి 2003న పావెల్ ప్రసంగించారు.

  Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Oneindia Telugu

  అయితే ఆయన ఆరోపణలు అబద్ధమని ఆ తర్వాత రుజువైంది. కాగా, యూఎస్‌లో ఆ ప్రసంగం తన కెరీర్‌పై మాయని మచ్చగా మారిందని తర్వాత పావెల్ గుర్తుచేసుకున్నారు. అది ఒక మచ్చ.. అది ఎల్లప్పుడూ నా రికార్డులో ఒక భాగం. ఇది బాధాకరమైనది అని 2005 లో ఓ ఇంటర్వ్యూలో పావెల్ పేర్కొన్నారు. వియత్నాం యుద్ధంలో పాల్గొన్న పావెల్ అందులో గాయపడ్డారు. ఆ యుద్ధం తర్వాత ఆయన రాజకీయ, మిలటరీ వ్యూహకర్తగా అనుభవం సంపాదించారని విశ్లేషకులు చెబుతారు. ఆ తర్వాత పలువురు రాజకీయ నేతలకు మిలిటరీ సలహాదారుగా పావెల్ పని చేశారు. పావెల్ మృతి పట్ల అమెరికా ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది.

  English summary
  Colin Powell, first Black US secretary of state, dies of Covid-19 complications
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X