వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూలిన హెలికాప్టర్‌: 16మంది మృతి(వీడియో)

|
Google Oneindia TeluguNews

బోగోటా: కొలంబియాలోని బోగోటా ప్రాంతంలో బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 16మంది అధికారులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో మొత్తం 17మంది అధికారులు ఉన్నారు.

వీరు కొలంబియాలోని ఉసుగ డ్రగ్‌ గ్యాంగ్‌ని పట్టుకోవడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

Colombia helicopter crash kills 16 police officers

కాగా, కొలంబియా రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ. వాతావరణం అనుకూలించకపోవడం, పొగ మేఘాలు కమ్ముకోవడంతో ఏదైనా కొండను ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని చెప్పారు.

ఇది ఇలా ఉండగా, డ్రగ్ ముఠానే హెలికాప్టర్‌ను పేల్చివేసిందంటూ ప్రచారం కొనసాగుతోంది. అయితే, అక్కడి స్థానికులు మాత్రం హెలికాప్టర్లపై ఎలాంటి కాల్పులు జరగలేదని చెబుతున్నారు.

బంగారంతో తయారు చేసిన బొమ్మలంటూ మోసం

సిడ్నీ: బంగారంతో తయారు చేసిన బొమ్మలంటూ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఆస్ట్రేలియా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడి వద్ద నుంచి ఎనిమిది నకిలీ బంగారపు లాఫింగ్ బుద్ధ విగ్రహాలు, దాదాపు 100 నకిలీ బంగారపు కడ్డీలు, ఐదు మొబైల్ ఫోన్లు, వివిధ దేశాలకు చెందిన కరెన్సీతోపాటు నకిలీ పాస్ పోర్ట్ లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.

ఈ మేరకు ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు. బంగారపు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని స్థానికంగా నివసిస్తున్న ఓ మహిళ అధికంగా సొమ్ము వెచ్చించి కొనుగోలు చేసింది. అయితే ఆ బొమ్మ రాగితో తయారు చేసి... బంగారం పూత పూసిన నకిలీదని గుర్తించిన సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.

English summary
A police helicopter has crashed in a jungle area of north-west Colombia, killing at least 16 officers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X