వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రగ్స్ స్మగ్లింగ్: మోడల్ కు ఉరి శిక్ష!

|
Google Oneindia TeluguNews

బీజింగ్: డ్రగ్స్ సరఫరా చేస్తు దొరికిపోయిన కొలంబియా మోడల్ జులియానా లోపేజ్ (22) కు యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరి శిక్ష పడే అవకాశం ఉందని చైనా న్యాయవాదులు అంటున్నారు. క్షణాలలో తప్పించుకుని మాయమైన జులియానా లోపేజ్ కోసం చైనా పోలీసులు గాలిస్తున్నారు.

అమె ఎక్కడ ఉందో తెలియడం లేదని చైనా రేడియో ఇంటర్నేషనల్ బుధవారం వెల్లడించింది. బీజింగ్ లోని కొలంబియన్ రాయబార కార్యాలయంలో జులియానా లోపేజ్ తలదాచుకుని ఉంటుందని చైనా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ల్యాప్ టాప్ లో డ్రగ్స్ పెట్టి తరలిస్తున్న సమయంలో చైనాలోని గాంగ్జౌ ప్రావిన్స్ లోని గాంగ్జౌ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆ సందర్బంలో జులియానా లోపేజ్ తృటిలో తప్పించుకుంది. జులియానా కేసు వాదించడానికి ఆమె కుటుంబ సభ్యులు మంచి న్యాయవాది కోసం గాలిస్తున్నారు.

Colombian Model carrying drugs inside her laptop

మిస్ వరల్డ్ మెడిలిన్ పోటిల్లో లోపేజ్ పోటిదారుగా ఉన్న సంగతి మీడియా గుర్తు చేస్తున్నది. అయితే లోపేజ్ అమాయకురాలని, ఆమెను కావాలనే డ్రగ్స్ రవాణా కేసులో ఇరికిస్తున్నారని ఆమె స్నేహితురాలు లిస్ ఫెర్నాండస్ ఆరోపిస్తున్నది.

2012వ సంవత్సరంలో పెరుగ్వే దేశానికి చెందిన 31 సంవత్సరాల యువతి డ్రగ్స్ సరఫరా చేస్తు చైనాలో పట్టుబడింది. అప్పటి నుండి ఆమె జైలులో ఉంది. ఆమెకు ఉరి శిక్షపడే అవకాశం ఉందని చైనా న్యాయవాదులు అంటున్నారు. జులియానాకు అదే శిక్షపడుతుందని అంటున్నారు. చైనాలో డ్రగ్స్ సరఫరా చేస్తే కఠినంగా శిక్షిస్తారు.

English summary
A 22-year-old Colombian model is facing the death penalty after she was caught with a plastic bag full of drugs hidden inside her laptop.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X