వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడిన ఉత్కంఠ: కొలంబియా అధ్య‌క్షుడికి నోబెల్ శాంతి బ‌హుమ‌తి

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

స్టాక్ హోం: ప్రతిష్టాత్మక నొబెల్ శాంతి బహుమతి కొలంబియా అధ్య‌క్షుడు జువాన్ మాన్యూల్ శాంటోస్‌ను వ‌రించింది. కొలంబియా రెబ‌ల్స్‌తో ఆయ‌న కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి గాను ఆయ‌న‌ను నోబెల్ శాంతి పురస్కారం అందజేయనున్నట్టు కమిటీ తెలిపింది.

52 ఏళ్ల యుద్ధానికి తెర‌దించుతూ శాంటోస్ ఈ శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇందుకు గాను ఆయన ఎంతో కృషి చేశారు. అయితే ఆ త‌ర్వాత నిర్వ‌హించిన రెఫ‌రెండ‌మ్‌లో ఆ దేశ ప్ర‌జ‌లు ఈ శాంతి ఒప్పందాన్ని వ్య‌తిరేకించారు. అయినా సరే శాంతి కోసం తాను ప్ర‌య‌త్నిస్తూనే ఉంటాన‌ని శాంటోస్ ప్ర‌క‌టించారు.

కేవ‌లం శాంతి కోసం ఎన్నో వేధింపుల‌ను ఎదుర్కొన్న కొలంబియా ప్ర‌జ‌ల‌కు, శాంతి ప్ర‌క్రియ‌కు స‌హ‌కరించిన అన్ని పార్టీల‌కు ఈ పురస్కారం నివాళిగా భావించాలని నార్వేలోని నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. కాగా, 2010 ఆగస్టు 7న కొలంబియా అధ్యక్షుడిగా జువాన్ మాన్యూల్ శాంటోస్ ఆ దేశ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు.

కొలంబియాలో అత్యంత శ‌క్తివంత‌మైన మార్కిస్ట్ గ్రూప్‌గా పేరుగాంచిన ఫార్క్ రెబ‌ల్స్‌ ద‌ళం దాదాపు 52 ఏళ్లుగా కొలంబియా ప్ర‌భుత్వంతో పోరాటం చేస్తూనే ఉంది. అంత‌ర్యుద్ధం వ‌ల్ల దేశ‌ విలువ‌లు నాశ‌న‌మైన‌ట్లు అధ్యక్షుడు శాంటోస్ శాంతి ఒప్పందం సందర్భంగా అభిప్రాయ‌ప‌డ్డారు. దాదాపు నాలుగేళ్ల చ‌ర్చ‌ల త‌ర్వాత శాంతి ఒప్పందం కొలిక్కివ‌చ్చింది.

క్యూబా రాజ‌ధాని హ‌వానాలో కొలంబియా ప్ర‌భుత్వానికి, ఫార్క్ ద‌ళాల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగి చివరకు ఒప్పందం జరిగింది. 52 ఏళ్ల పోరాటంలో సుమారు రెండున్న‌ర ల‌క్ష‌ల మంది చ‌నిపోయారు. మ‌రో 60 ల‌క్ష‌ల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. శాంతి ఒప్పందం ద్వారా సంక్షోభం ముగుస్తుంద‌ని, ఆ త‌ర్వాత దేశ పున‌ర్నిర్మాణం చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని అధ్యక్షుడు శాంటోస్ తెలిపారు.

English summary
Colombian President Juan Manuel Santos won the 2016 Nobel Peace Prize on Friday in a surprise choice after Colombians voted "No" to an agreement he signed with Marxist rebels to end 52 years of war.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X