వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మలేసియాలో హిందూ ఆలయానికి రంగులు: నేషనల్ హెరిటేజ్ ఆగ్రహం, ఎందుకంటే

By Srinivas
|
Google Oneindia TeluguNews

కౌలాంపూర్: మలేషియాలోని ఓ ప్రముఖ హిందూ దేవాలయానికి అనుమతి లేకుండా రంగులు వేయడంపై నేషనల్ హెరిటేజ్ డిపార్టుమెంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మలేషియాలో బటూ కేవ్స్ ప్రముఖ హిందూ ఆలయం. పన్నెండు ఏళ్లకు ఓసారి నిర్వహించే కార్తికేయ ఉత్సవంలో భాగంగా ఆలయంతో పాటు మెట్లకు ఆకర్షణీయమైన రంగులు వేశారు. ఈ ఆలయ విశిష్టతల దృష్ట్యా దీనికి వారసత్వ గుర్తింపు దక్కింది.

Colourful paint job on Malaysias Batu Caves staircase may be illegal

దీంతో తమ అనుమతి లేకుండా ఆలయానికి రంగులు వేసినందుకు ఆలయ కమిటీపై నేషనల్‌ హెరిటేజ్‌ సంస్థ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇక్కడ తమిళులు ఎక్కువగా ఉంటారు.

ఈ ఆలయం బటూ గుహల మధ్య ఉంది. కౌలాలంపూర్‌ శివారులో ఉన్న ఈ ఆలయం అక్కడి పర్యాటకానికి పెట్టింది పేరు. ఒకే ఆవరణలో సుమారు ఎనిమిది ఆలయాలను పునరుద్ధరించారు. ఇందులోనూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇక్కడ చాలా ప్రసిధ్ది చెందింది. ఈ ఆలయాలను చేరుకోవాలంటే 272 మెట్లు ఎక్కాలి. పర్యాటకులను ఆకట్టుకోవడానికి, ఉత్సవాల కోసం.. ఆకర్షణీయ రంగులు వేశారు.

English summary
The colourful staircase of the iconic Batu Caves Temple that has gone viral on social media could land the temple committee in trouble, as the multi-million ringgit painting and renovation works were not sanctioned by the National Heritage Department.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X