వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యం: ఇలా ఎన్నుకుంటారు!

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పద్మవ్యూహం లాంటిది. 51రాష్ట్రాలు కలిగిన అమెరికాలో అధ్యక్షుడిని ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవడం జరుగుతుంది. ఇదేం సాధారణ విషయం కాదు. ఎలక్టోరల్ కాలేజీ పద్ధతిలో వారు అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. అయినా అక్కడ పాపులర్ ఓట్లు, ఎలక్టోరల్ ఓట్లు కూడా కీలకమే. ఎందుకంటే.. ఇదంతా 1787లో ఫిలడెల్పియా రాజ్యాంగ సమావేశంలో పేర్కొనడం జరిగింది. ఎన్నికలతోపాటు అన్ని అంశాల్లో కూడా 13కాలనీలు నిర్ణయాధికారాన్ని పొందాయి.

యూఎస్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 ప్రకారం అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ: 'లెజిస్లేచర్‌ను ప్రతీ స్టేట్ ప్రత్యక్షంగా నియమిస్తుంది. ఎలక్టోర్స్ కు సమానంగా సెనెటర్లు ఉంటారు. కాంగ్రెస్‌లో వీరిని రాష్ట్రాలకు ప్రతినిధులుగా పిలవడం జరుగుతుంది'.

కానిస్టిట్యూషన్ కన్వెన్షన్ నియమించిన 11మందితో కూడిన కమిటీ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను స్వాతంత్ర్యంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రాలు ఎలక్టోర్స్‌ను నియమిస్తాయి.

Column: A backgrounder for the US Presidential elections

ఎలక్టోరల్ కాలేజీ

ఎలక్టోర్స్ అంటే రాజకీయ నాయకులై ఉంటారు. వారు ఎన్నుకోబడతారు. రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎలక్టోర్స్‌గా నిర్ణయిస్తాయి. వారు ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు. ఇది అధ్యక్ష ఎన్నికలకు మొదటి దశగా చెప్పుకోవచ్చు.

చాలా మంది భారతీయులకు తెలిసే ఉంటుంది నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని. అయితే, అమెరికా ప్రజలు అధ్యక్ష బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్‌కు గానీ, డొనాల్డ్ ట్రంప్‌కు గానీ ఓట్లు వేయరు. అధ్యక్ష ఎలక్టోర్స్‌కు మాత్రమే వారు ఓటు వేస్తారు. వారు డెమోక్రాటిక్ లేదా రిపబ్లికన్ పార్టీకి చెందినవారు కావచ్చు.

రెండో దశ డిసెంబర్ 19న జరుగుతుంది. ప్రెసిడెన్షియల్ ఎలక్టోర్స్ వారి వారి రాష్ట్రాల్ల రాజధానుల్లో సమావేశమై అధికారికంగా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. నవంబర్ 8న జరిగేది పాపులర్ ఓట్ కాగా, డిసెంబర్ 19న జరిగేది ఎలక్టోరల్ ఓట్.

విజయం సాధించిన అభ్యర్థి 270 ఎలక్టోరల్ ఓట్లు కలిగి ఉండాలి. సెనెటర్స్, హౌజ్ ఆఫ్ రిప్రెజెంటెటీవ్స్ మొత్తం కలిపి 538 ఎలక్టోరల్స్ ఉండగా, అందులో మెజార్టీ సాధించాలి. డిసెంబర్ 19న విజయం సాధించిన వారికి అందరి మద్దతు లభిస్తుంది. ఏ పార్టీ అయితే మెజార్టీ పాపులర్ ఓట్లు సాధిస్తుందో.. మొత్తం ఎలక్టోరల్ ఓట్లను గవర్నర్ ద్వారా పొందుతుంది.

మేనే, నెబ్రాస్కా మినహా అన్ని రాష్ట్రాల్లో ఇది అమలవుతుంది. ఉదాహరణకు న్యూయార్క్‌లో రిపబ్లికన్ పార్టీ 29 సీట్లలో 15 గెలుచుకుంటే.. మొత్తం 29 సీట్లను కూడా ఆ పార్టీకి ఇవ్వడం జరుగుతుంది.

'ది విన్నర్ టేక్స్ ఆల్' అనే పద్ధతి 1824 కానిస్టిట్యూషన్ సెక్షన్ ద్వారా అమలులోకి వచ్చింది. ప్రెసిడెంట్ ఎలక్టోర్స్ నియమించే పద్ధతి కూడా దీని ద్వారానే వచ్చింది. అయితే, మేనే, నెబ్రాస్కలు మాత్రం విన్నర్ టేక్స్ ఆల్ అనే పద్ధతి సంతృప్తికరంగా లేదని, మంచి ఓటు పద్ధతి కాదని పేర్కొన్నాయి.

ఇక మూడు దశ విషయనికొస్తే.. అధ్యక్ష ఎన్నికను అధికారికంగా ప్రకటించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. ఉమ్మడి సమావేశానికి ఛైర్మన్ వ్యవహరించి ఎలక్టోరల్ ఓట్లను పరిగణలోకి తీసుకుని జనవరి 6, 2017లో అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను పూర్తి చేస్తారు. ఒకవేళ మెజార్టీ రాకపోతే హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అధ్యక్షుడిని ఎన్నుకుంటే.. సెనెటర్లు ఉపాధ్యాక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది.

గతంలో కొన్ని ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. జనవరి 6, 2001లో ఉపాధ్యక్షుడు ఆల్ గోరే తనకు తాను అధ్యక్షుడి(ఛైర్మన్ ఆఫ్ సెనెట్)గా ప్రకటించుకున్నారు. మియామీలో వివాదాస్పద కౌంటింగ్ ద్వారా జార్జ్ డబ్ల్యూ బుష్ అధ్యక్ష పదవి చేపట్టారు.

అయితే ఉమ్మడి సమావేశాల్లో డెమోక్రాట్స్ జార్జ్ బుష్‌ని అధ్యక్షుడిగా ప్రకటించేశారు. 1961లో కూడా ఉపాధ్యక్షుడైన రిచర్డ్ నిక్సన్.. జాన్ ఎఫ్ కెన్నడీ పై పోటీ చేశారు. దీనికి మద్దతుగా హవాయి గవర్నర్ తన మొత్తం ఎలక్టోర్స్ ను నిక్సన్ అందజేసి కాంగ్రెస్ నివేదికను సమర్పించారు. అయితే, మళ్లీ లెక్కింపు జరపగా కెన్నడీ విజేత అయ్యారు.

2012లో ఒబామా 51.1శాతం పాపులర్ ఓట్లు, 332 ఎలక్టోరల్ ఓట్లు సంపాదించారు. కాగా, ప్రత్యర్థి మిట్ రోమ్నీ 47.25శాతం పాపులర్ ఓట్లు, 206 ఎలక్టోరల్ ఓట్లు పొందారు. 2001లో ఆల్ గోరే 48.4శాతం పాపులర్ ఓట్లు సాధించి.. 47.9శాతం ఓట్లు సాధించిన జార్జ్ బుష్ పై స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. 271 ఎలక్టోరల్ ఓట్లు బుష్ సాధించగా, గోరే 266 ఓట్లు సాధించారు. 1960-61లో 49.72శాతం ఓట్లు జాన్ ఎఫ్ కెన్నడీ సాధించగా, 49.55శాతం రిచర్డ్ నిక్సన్ సాధించారు. ఎలక్టోరల్ ఓట్లు విషయానికొస్తే కెన్నడీకి 303, నిక్సన్‌కు 219 భారీ తేడా ఏర్పడింది. దీంతో కెన్నడీ అధ్యక్ష పదవి చేపట్టారు.

ప్రస్తుత పరిస్థితి కూడా ఇలాగే ఉంది. హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్‌ల తీవ్రమైన పోటీ ఉంది. వాషింగ్టన్‌లోని మా ప్రతినిధి సమాచారం ప్రకారం వీరిద్దరిలో ఎవరో ఒకరు అతిస్వల్ప మెజార్టీతో విజయం సాధించే అవకాశం ఉంది. ఎన్నిక కొంత క్లిష్టతరం కారణంగా అమెరికా సుప్రీంకోర్టే ఈ ఎన్నిక ఫలితాలను విడుదల చేస్తుందని కొన్ని భారత మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. అయితే, ఇది వాస్తవం కాకపోవచ్చు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ పూర్తిగా చట్టబద్ధంగా జరుగుతోంది. కాగా, ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న బరాక్ ఒబామా, ఉపాధ్యక్షుడిగా ఉణ్న బిడెన్ లు జనవరి 20, 2017లో తమ పదవి నుంచి తప్పుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి సమావేశం నూతన అధ్యక్షుడిని, ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది.

English summary
Prima facie, the US system of Presidential elections will appear to be labyrinthine. Why did they have to have a peculiar system for electing their President when they could have had a simpler way of choosing him or her through direct universal suffrage or indirectly through their 51 states? Why did they have to choose their President through an intermediary called "Electoral College"? Why should there be "Popular votes" and "Electoral Votes"?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X