వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంహెచ్ 370 మిష్టరీ వీడుతోంది: బరువెక్కిన గుండెతో

By Srinivas
|
Google Oneindia TeluguNews

కౌలాలంపూర్: 2014 మార్చి 8వ తేదీన గల్లంతైన ఎంహెచ్ 370 విమాన ప్రమాదం మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడాదిన్న అవుతున్నా ఆ విమానం ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. ఇప్పుడు మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎయిర్ క్రాఫ్ట్ సీటు కుజన్, విండోకు సంబంధించిన శిథిలాలు, అల్యూమినియం రేకు, సీటు కుజన్స్ తదితరాలు కనిపించినట్లుగా మలేషియా రవాణా శాఖ మంత్రి గురువారం నాడు చెప్పారు. వీటిని హిందూ మహాసముద్రంలో గుర్తించినట్లు చెప్పారు.

అయితే, ఆ దొరికిన శిథిలాలు ఎంహెచ్ 370వా కాదా తేలాల్సి ఉందని చెప్పారు. ఫ్రెంచ్ అథారీటీస్ వాటిని పరిశీలిస్తారని తెలిపారు. అయితే, అవి ఎంహెచ్ 370విగానే భావిస్తున్నారు. వీటిని నిర్ధారించాల్సి ఉంది.

Confirmation of MH370 debris does little to dispel theories

గత వారం హిందూ మహాసముద్రంలోని మారుమూల రీయూనియన్ ద్వీపం సమీపంలో రెక్కలాంటి శకలం లభించింది. దానిని క్షుణ్ణంగా పరిశీలించిన అంతర్జాతీయ బృందం అది ఎంహెచ్ 370 విమానానిదేనని నిర్ధారించింది. ఈ శకలాల ఆధారంగా సెర్చ్ మరింత ఎక్కువ చేశారు.

మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ మాట్లాడుతూ... విమానం అదృశ్యమైన 515 రోజుల తర్వాత ఈ విషయం చెప్పేందుకు ఎంతో బాధగా ఉందన్నారు. దీంతో విమానం త్వరలోనే ఆచూకీ లభించవచ్చునని చెప్పారు. తన గుండె బరువెక్కిందని, ప్రమాదంలో మృతి చెందిన కుటుంబ సభ్యులు ఈ వార్త విని ఎంతగా తల్లడిల్లుతారో అన్నారు. ఇంకా బ్లాక్ బాక్స్ దొరకాల్సి ఉంది.

English summary
Aircraft Cushions, Window Panes Found on Island Where MH370 Debris Recovered: Malaysia Minister
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X