వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మధ్యంతరం తప్పదా: ఎంపీ ఫిరాయింపుతో మెజార్టీ కోల్పోయిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

|
Google Oneindia TeluguNews

యూకే: రాజకీయాలు ఎక్కడైనా రాజకీయాలే. ఒక్క భారత దేశంలోనే నేతలు ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించడం లేదు. బ్రిటన్‌లో కూడా ఇదే జరుగుతోంది. తాజాగా అధికారిక కన్జర్వేటివ్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఒకరు లిబరల్ డెమొక్రట్ పార్టీకి ఫిరాయించడంతో ప్రధాని బోరిస్ జాన్సన్‌కు పార్లమెంటులో మెజార్టీ తగ్గింది. పార్లమెంటులో జీ-7 సమావేశంపై ప్రధాని బోరిస్ జాన్సన్ ఓ ప్రకటన చేస్తున్న నేపథ్యంలో టోరీ నియోజకవర్గం ఎంపీ ఫిలిప్ లీ లిబరల్ డెమొక్రాట్ పార్టీలోకి ఫిరాయించారు.

కన్జర్వేటివ్ పార్టీ సభ్యుడిగా కొనసాగితే దేశ ప్రయోజనాల దృష్ట్యా పనిచేయలేనని అందుకే పార్టీ ఫిరాయిస్తున్నట్లు ఫిలిప్ లీ చెప్పారు. బ్రెగ్జిట్ అంశంలో కన్జర్వేటివ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సంతృప్తికరంగా లేదని ఫిలిప్ లీ ఆరోపించారు. ప్రజల జీవితాలు, వారి జీవనోపాధిని ప్రభుత్వం దెబ్బతీసేలా ఉందని చెప్పిన ఫిలిప్... యూకే సమగ్రతను బోరిస్ ప్రభుత్వం కూల్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అంతేకాదు రాజకీయంగా కూడా బ్రెగ్జిట్ అంశాన్ని మ్యానిపులేట్ చేస్తోందని మండిపడ్డారు.

boris jhonson

ఇక తమ పార్టీలోకి ఎంపీ ఫిలిప్‌ను సాదరంగా స్వాగతిస్తున్నట్లు లిబరల్ డెమొక్రటిక్ పార్టీ ప్రకటన చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించడమే కాకుండా, ప్రజాస్వామ్యంను, ప్రపంచ దేశాల మధ్య బ్రిటన్ దేశాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు ఫిలిప్. అందుకే తాను లిబరల్ డెమొక్రాట్స్ పార్టీల చేరుతున్నట్లు ప్రకటించారు. ఇక లిబరల్ డెమొక్రాట్లు బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా తన నిర్ణాయన్ని వెల్లడించారు. ఇక కన్జర్వేటివ్ పార్టీ నుంచి మరో ఇద్దరు ఎంపీలు డెమొక్రాట్ పార్టీలో చేరారు. ఇందులో టోరీ మాజీ ఎంపీ సారా వొలాస్టన్, మాజీ లేబర్ ఎంపీ చుకా ఉమున్నా ఉన్నారు.

బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా విపక్షం ప్రవేశపెట్టిన బిల్లు పాస్ అయితే ప్రభుత్వం వెంటనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించేలా మోషన్ పాస్ చేస్తుందని అధికారులు మీడియాకు వివరించారు. అయితే ఇది పాస్ కావాలంటే లేబర్ పార్టీ మద్దతు తప్పనిసరి అవుతుంది. ఎందుకంటే బిల్లు పాస్ కావాలంటే సభలో తగిన మెజార్టీ కావాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 14న మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇదే జరిగితే గత ఐదేళ్లలో బ్రిటన్‌లో మూడో సారి ఎన్నికలు నిర్వహించినట్లు అవుతుంది. అయితే ఎన్నికలు నిర్వహించాలంటే పార్లమెంటు లోపల బయట ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంది.

English summary
British Prime Minister Boris Johnson lost his working majority in parliament on Tuesday when one of his Conservative lawmakers defected to the pro-European Union Liberal Democrats.Phillip Lee crossed the floor of the House of Commons just as Johnson began giving a statement on last month's G7 summit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X