• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వార్: చైనా రాయబారి డెత్ మిస్టరీ.. అమెరికాపై అనుమాం.. చైనా ఫైర్.. ఇక దాడులు తప్పవంటూ..

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య తలెత్తిన విభేధాలు తారా స్థాయికి చేరినవేళ.. ఇజ్రాయెల్‌లో చైనీస్ రాయబారి అనుమానాస్పద మృతి ప్రపంచ రాజకీయాలను ఒక్కసారే కుదిపేసింది. టెల్ అవీవ్ సిటీలో ఉంటోన్న చైనా రాయబారి డ్యు వీయ్ ఆదివారం ఉదయం స్పృహ కోల్పోయి కనిపించారని, ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారని పోలీసులు ప్రకటించారు. అయితే మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు.

  China Ambassador To Israel Du Wei Is No More, China Suspects US !
  మూడు నెలలుగా ఒంటరిగానే..

  మూడు నెలలుగా ఒంటరిగానే..

  చనిపోయిన డ్యు వీయ్ వయసు 57 సంవత్సరాలు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఇజ్రాయెల్ రాయబారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. కరోనా ఆంక్షల కారణంగా భార్య, కొడుకును చైనాలోనే ఉంచేశారు. టెల్ అవీవ్ లోని బంగళాలో ఒంటరిగా ఉంటోన్న ఆయన ఆదివారం ఉదయం ఎంతకీ తలుపు తీయకపోయేసరికి, అక్కడి పనివాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. అంబులెన్స్ తో సహా చేరుకునన పోలీసులు.. వీయ్ ను ఆస్పత్రికి తరలించారు. ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనపై అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతగానీ ఇజ్రాయెల్ పోలీసులు అధికారిక ప్రకటన చేయకపోవడం వివాదాస్పదమైంది.

  అమెరికా పనేనా?

  అమెరికా పనేనా?

  కరోనా వైరస్ నేపథ్యంలో చైనాను శిక్షించి తీరుతామని అమెరికా పదే పదే హెచ్చరిస్తుంటం, అమెరికా చేతిలో కీలుబొమ్మగా పేరుపొందిన ఇజ్రాయెల్ లోనే చైనీస్ రాయబారి అనుమానాస్పదంగా చనిపోవడంతో నెటిజన్లకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టార్గెట్ అయ్యారు. ఆమధ్య ఇరాన్ ఆర్మీ కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా అత్యంత దారుణంగా డ్రోన్లతో బాంబులేసి చంపిన వైనాన్ని నెటిజన్లు గుర్తుచేసుకున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని డ్యు వీయ్.. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ లో అడుగుపెట్టినతర్వాత వైరస్ సోకనప్పటికీ, 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ లో గడిపారు. ఉన్నట్టుండి ఆయనెలా చనిపోయారనేది ఇంకా తేలాల్సిఉంది.

  చైనా వ్యూహాత్మక మౌనం..

  చైనా వ్యూహాత్మక మౌనం..

  ఇజ్రాయెల్ లో తన రాయబారి అనుమానాస్పద మృతిపై చైనా ప్రభుత్వం వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నది. కొంతకాలంగా ఇజ్రాయెల్ కు దగ్గరయ్యేందుకు చైనా అనేక ప్రయత్నాలు చేసి, కొద్దిగా సక్సెస్ కూడా సాధించింది. ఇది రుచించని అమెరికా.. అదను చూసి రెండు దేశా మధ్య చిచ్చుపెట్టేందుకే రాయబారిని అంతం చేసి ఉండొచ్చని ఇజ్రాయెల్ వెబ్ సైట్లలో రిపోర్టులు వచ్చాయి. అయితే మూడు దేశాల ప్రభుత్వాలేవీ దీనిపై అధికారికంగా స్పందించలేదు. పూర్తి వివరాలు తెలుసుకున్నాక మాట్లాడుతామని చైనా ప్రభుత్వ ప్రతినిధి అన్నారు.

  ముదిరి పాకనపడింది..

  ముదిరి పాకనపడింది..

  కరోనా వైరస్ నేపథ్యంలో అమెరికా-చైనాల మధ్య కొనసాగుతోన్న మాటల యుద్ధం ముదిరిపాకానపడింది. చైనా దిగ్గజ కంపెనీ హువావేపై ట్రంప్ సర్కారు సరికొత్త ఆంక్షలు విధించారు. విదేశాల్లో సెమీ కండక్టర్ల డిజైన్, ఉత్పత్తి విషయంలో అమెరికా టెక్నాలజీని వాడకుకోకుండా హువావెపై నిఘా పెట్టాలని ట్రంప్ సర్కారు ఆదేశించింది. హువావె వల్ల అమెరికా రక్షణ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తాయన్న ఆరోపణలపై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే చైనా మాత్రం వీటిని ఖండించింది. అమెరికా కంపెనీలకు దీటుగా ఎదురుగుతున్నాయన్న అక్కసుతోనే చైనా టెక్ కంపెనీలపై ట్రంప్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని డ్రాగన్ దేశం మండిపడింది. త్వరలో అమెరికాలో ఎన్నికలు జరగాల్సి ఉండగా చైనాతో వ్యవహారం ఏమలుపు తిరుగుతుందోనని ప్రపంచదేశాలు ఆందోళనలో పడ్డాయి. రాబోయే రోజుల్లో అన్ని రంగాలపై దాడులు జరగొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  English summary
  China's ambassador to Israel, Du Wei, was found dead at his residence on the outskirts of Tel Aviv on Sunday, the police said. Conspiracies after China ambassador death comes amid US-China tensions.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X