వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోరం: బ్రేకప్ చెప్పిందని 80సార్లు కత్తితో పొడిచాడు

|
Google Oneindia TeluguNews

లండన్‌: తమ మధ్య ఉన్న సంబంధానికి ముగింపు పలుకుదామన్న ప్రియురాలి వ్యాఖ్యలను జీర్ణించుకోలేని ఓ ప్రియుడు సుమారు 80సార్లు కత్తితో పొడిచి ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ దుర్మార్గుడు పాశవికంగా యువతిపై దాడి చేయడంతో చివరికి కత్తే పూర్తిగా వంగిపోయింది. ఈ దారుణ ఘటన గత జులైలో లండన్‌లో చోటు చేసుకుంది.

కాగా, ఈ హత్య కేసును అక్కడి న్యాయస్థానం మంగళవారం విచారించింది. లండన్‌కు చెందిన జోర్డన్‌ టైలర్‌(22) తన ప్రియురాలు లారా డెవియస్‌(21)తో కలిసి ఉండేవాడు. ఇద్దరి మధ్య ఉన్న సంబంధానికి ముగింపు పలుకుదామని ఓ రోజు లారా కోరడంతో ఆగ్రహానికి గురైన టైలర్‌ ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు.

'Controlling' boyfriend stabbed girlfriend 82 times after being dumped

పారిపోవడానికి ప్రయత్నించినా.. వెంబడించి చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి సుమారు 80 సార్లు కత్తితో పొడిచాడని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

తీవ్రంగా గాయపడిన లారాను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందిందని చెప్పారు. హత్య చేసినందుకు విచారణ సందర్భంగా టైలర్‌ ఎలాంటి విచారం వ్యక్తం చేయలేదు. కాగా, చేసిన నేరానికి టైలర్‌కు కఠినమైన శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు.

English summary
A 22-year-old jealous UK man brutally killed his girlfriend by stabbing her more than 80 times for ending their relationship, a UK court has been told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X