వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గెలిచిసంబురంలో సోషల్ మీడియా లో పోస్టు ఉద్యోగం ఊడింది

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లి పై వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన పమీలా టేలర్ అనే మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోయింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ :వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఓ మహిళ తన ఉద్యోగాన్ని కోల్పోయింది. భవిష్యత్తులో ఆమె ఉద్యోగం లో చేరకుండా సస్పెన్షన్ ను విధించారు. వేధింపులు, వివక్ష నిరోధక చట్టాలను ఉల్లంఘించినందుకు ఆమెను డైరెక్టర్ పదవి నుండి తొలగించారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పమిలా టేలర్ అనే మహిళ ఉద్యోగాన్ని కోల్పోయింది. భవిష్యత్తులో ఆమె విధుల్లో చేరకుండా సస్పెన్షన్ ను విధించారు.

ఈ ఏడాది నవంబర్ మాసంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన సందర్భంలో ఆమె సోషల్ మీడియాలో సంబరాలు చేసుకొంది. అందమైన హూందాతనం ఉట్టిపడే మిలానియా ట్రంప్ వైట్ హౌజ్ కు వస్తున్నందుకు సంతోషంగా ఉంది, ఇప్పటివరకు హీల్స్ వేసుకొన్న ఏప్ ను చూసి విసిగిపోయాను అంటూ పోస్టు చేసింది.

controversy statement on first lady of america, woman lost his job

ఈ పోస్టు పై వివాదంగా మారింది. ఈ వ్యాఖ్యలపై అమెరికాలో దుమారం రేగింది. పమీలా టేలర్ డైరెక్టర్ గా పనిచేస్తోన్న క్లె కౌంటీ డెవలప్ మెంట్ కార్ప్ అనే లాభం లేని స్వచ్చంధ సంస్థపై అధికారులు దృస్టిపెట్టారు. ఈ సంస్థ ప్రభుత్వ నిధులతో పేదలకు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

కాని, ఈ సంస్థ ఎలాంటి నిబంధనలను పాటించడం లేదనే విషయాన్ని అధికారులు గుర్తించారు. అయితే దీనికి సహయాన్ని నిలిపివేయవచ్చు, లేదా దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే అవకాశం ఉంది.కాని, ప్రభుత్వం వాటిని చేయలేదు. ప్రతి రోజూ ఈ సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకుగాను అప్పాల్బన్ ఏరియా ఏజెన్సీని నియమించింది.

ఈ మేరకు రెండు సంస్థల మద్య గత శుక్రవారం నాడు ఒప్పందం జరిగింది.అదే రోజు పమీలాను విధుల నుండి తొలగించారు. ఇప్పటికే తన వ్యాఖ్యాలను అంగీకరించడంతో ఆమె సస్పెన్షన్ లో ఉంది. ప్రస్తుతం ఆమె విధుల్లో తిరిగి చేరకుండా సస్పెన్షన్ విధించారు. వేధింపులు, వివక్ష నిరోధక చట్టాలను ఉల్లంఘించినందుకుగాను ఆమెను డైరెక్టర్ పదవి నుండి తప్పిస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది.

English summary
The non profit organization director whose controversial ape in heels comment about first lady michelle obama lost her job. after donald trump's election as president , taylor controversy statement on social media,she was suspended november month,she removed from non profit organation director post on friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X